భగవద్గీత నేను అర్థం చేసుకున్న విధంగా   Part 6

(అక్షర బ్రహ్మ యోగం )

శ్రీనివాసాచార్య మద్దాలి

 

 

న + క్షర = అక్షర = నాశము లేనిది. పరబ్రహ్మం. సృష్ఠి కి ఆవలి సృష్ఠి. 

 

పర - సృష్ఠి కి ముందు

అపర - సృష్ఠి కి తరువాత

 

అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ।। 8.3 ।।

 

సర్వోన్నతమైన, నాశములేని తత్త్వమునే బ్రహ్మన్ అందురు; వ్యక్తి యొక్క ఆత్మ తత్త్వమునే అధ్యాత్మ అంటారు. ప్రాణుల భౌతిక తత్త్వమునకు మరియు వాటి అభివృద్దికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్ష తో ఉన్న చర్యలు అంటారు.

 

అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ।।8.3 ।।

 

సర్వోన్నతమైన, నాశములేని తత్త్వమునే బ్రహ్మన్ అందురు; వ్యక్తి యొక్క ఆత్మ తత్త్వమునే అధ్యాత్మ అంటారు. ప్రాణుల భౌతిక తత్త్వమునకు మరియు వాటి అభివృద్దికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్ష తో ఉన్న చర్యలు అంటారు.

 

అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర ।।8.4 ।।

 

నిరంతరం మారుతునే ఉండే ఈ భౌతిక సృష్టినే అదిభూత అంటారు; అధిదైవము అధియజ్ఞము, అంటే సమస్త యజ్ఞములకు ప్రభువు.

 

యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరమ్ తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః ।।8.6 ।।

 

మరణ కాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో దేనినైతే గుర్తుచేసుకుంటాడో, ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండటం వలన అతను ఆ స్థితినే పొందును.

 

తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ ।। 8.7 ।।

 

ఎల్లపుడు నీ ధర్మ నిర్వచిత కర్తవ్యమైన యుద్ధము కూడా చేయుము. నీవు తప్పక అచేతన కర్మలతో, నిజ కర్మలతో, నిజ ధర్మము నిర్మల మనుస్సు తో నిర్వహించుము.

 

అభ్యాస యోగయుక్తేన చేతసానాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ ।।8.8 ।।

 

అభ్యాసము తో, నిరంతరంగా మనస్సుని, ఎటూ పోనీయక, పర బ్రహ్మం (సృష్థికి ఆవల ఉన్న పురుష) స్మరించుటయందే నిమగ్నం చేస్తే, నీవు తప్పకుండా నన్ను పొంద గలవు.

 

కవిం పురాణమనుశాసితారమ్అ ణోరణీయాంసమనుస్మరేద్యః  సర్వస్య ధాతారమచింత్యరూపమ్ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్।। 8.9।।

ప్రయాణకాలే మనసాచలేనభక్త్యా యుక్తో యోగబలేన చైవభ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్స తం పరం పురుషముపైతి దివ్యమ్ ।।8.10 ।।

 

పరబ్రహ్మ సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహా కందని దివ్య స్వరూపం; ఆయన సూర్యుడి కంటే తేజోవంత మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకీ అతీత రూపం. ఎవరైతే మరణ సమయంలో, యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో, ప్రాణములను కనుబొమలమధ్యే నిలిపి, నిశ్చలంగా దివ్య మంగళ పరబ్రహ్మ అత్యంత భక్తితో స్మరిస్తారో, వారు ఖచ్చితంగా పరబ్రహ్మను పొందుతారు. 

 

మరణం వ్యక్తిని నిరకారరూపంలో నిలుపుతుంది. పరబ్రహ్మ (ఎక్కడనుంచి సృష్థి వచ్చిందో) నిరాకార నిర్గుణ స్వరూపం. మరణం మనిషిని ఆ నిరకార నిర్గుణ స్వరూపంలో కలుపుతుంది. ఆ కలయికలో కాలగమనం లేదు. ఏ ఙ్ఞానం లేదు, ఏ విఙ్ఞానానికి స్థానంలేదు. ఏకత్వం అక్కడవుంది.. అద్వైతం అదే. నిజకర్మలతో, స్వధర్మ నిర్వహణతో ముక్తినొంది విసిష్థాద్వైతి అవుతాడు ప్రతి మనిషి.. అంతర్ముఖి అయినతర్వాత, (పాశ్చాత్య భౌతికవాదం బహిర్ముఖం) మనిషి హేతుబద్ధంగా కర్మ నిర్వహణతో జరుగుతుంది.  

 

యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ।।8.11 ।।

 

వేద పండితులు ఆయనను నాశము (క్షయము) చెందని వాడు అని చెప్తారు; ఆయనలో ప్రవేశించటానికి, మహోన్నత ఋషులు బ్రహ్మచర్యము పాటిస్తూ, ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు.

 

సర్వద్వారాణి సంయంమ్య మనో హృది నిరుధ్య చ మూర్ద్న్యాధాయాత్మనః ప్రాణమ్ ఆస్థితో యోగధారణామ్ ।।8.12 ।।

 

శరీరము యొక్క అన్ని ద్వారములను నియంత్రించి, మనస్సుని హృదయ స్థానము యందే నిలిపి, ప్రాణములను మూర్ద్న్యా (తల) స్థానములోకి లాగి, వ్యక్తి ఏకాగ్రతతో యోగ ధ్యానములో స్థితుడై ఉండవలెను.

 

మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిమ్ పరమాం గతాః ।। 8.15 ।।

 

దుఃఖాలయమశాశ్వతమ్ - నా ఆలోచనలో, దుఃఖాలయం అశాశ్వతమ్ ఈ రెండు మనిషికి సంబంధించిన గుణాలు. తీరని కోరికలు జీవితమును దుఃఖాలయం చేస్తుంది. శరీరము అశాశ్వతమ్. సృష్ఠించబడిన ప్రతీది విలీనమౌతుంది ప్రకృతి పురుషునిలో (పరబ్రహ్మ లో).

 

సహస్రయుగపర్యంతమ్ అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగసహస్రాంతాం తేఽహోరాత్రవిదో జనాః ।। 8.17 ।।

 

సూర్యసిద్ధాంతములో వివరించబడిన యుగ (సత్య, త్రేతా, ద్వాపర, కలి) విభజన గుర్తుకు రావాలి. 

 

కృత (సత్య) యుగ 4*432000 మానవ సంవత్సరాలు = 1728000 సంవత్సరాలు. 

త్రేతా యుగ 3*432000 = 1326000 సంవత్సరాలు.

ద్వాపర యుగ 2*432000 = 864000 సంవత్సరాలు.

కలి యుగ 1*432000 = 432000 సంవత్సరాలు.

 

443200000 సంవత్సరాలు. (This is one day but does not include night. This is close to earth’s age).

 

ఈ భూమి వయస్సు 4.543 బిలియన్ సంవత్సరాలు.

ఈ విశ్వవయస్సు 13.77 బిలియన్ సంవత్సరాలు.  

 

అందుకేనేమో భారత దేశాన్ని స్టీఫెన్ హకింగ్స్ అతిఎక్కువ స్థితిలో ఉంచి గౌరవించారు.   

 

అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే ।। 18 ।।

 

ఆ శ్లోకానికి ఇలా చెపితే బాగుంతుంది. భూమిపుట్టగనే జీవం పుట్టలేదు కాబట్టి. 

 

పరబ్రహ్మ (అవ్యక్త రూపము) పగలు లో సృష్ఠి మొదలౌతుంది. రాత్రిలో (ప్రళయం మొదలై) అంతం ఔతుంది.