Bhagavat Gita As Understood By Me- Part -12

(14వ అధ్యాయము: గుణత్రయ విభాగ యోగము)

Srinivas Maddali

 

 

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ।। 14.5 ।।

 

అర్థం:

 

ఓ, మహాబాహూ, ఈ 3 గుణములూ (సత్వ, రజ, తమో గుణములు) ప్రకృతి పరంగా సంభవిస్తాయి. పుట్టిన ప్రతి శరీరమునూ ఈ గుణములు బంధిoచును. ప్రకృతి ఈ 3 గుణములను, తన గర్భములో దాచుకొని పుట్టిన ప్రతి ప్రాణాంశకి పంచుతుంది.

 

వివరణ:

 

ఈ మూడు గుణములను శరీర ధర్మాన్ని అనుసరించి సంక్రమించిన శరీర ధర్మ ఙ్ఞానాన్ని అనుసరించి తన స్థితినిబట్టి వ్యక్తం చేస్తాయి.

 

తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్ సుఖ-సంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ।।14.6 ।।

 

అర్థం:

 

అనఘా, ఆ మూడింటిలో సత్వ గుణం అత్యంత పవిత్రమైనది మరియూ ప్రకాశవంతమయినది. సత్వగుణము సుఖము, మరియు మమకారాసతులలో ప్రాణాంశను (జీవాత్మను) బంధించివేయును.

 

 

వివరణ:

 

సత్వ గుణము ప్రశాంతతను, సుఖమునూ ఇస్తుంది కానీ వీటి పట్ల మమకారాసక్తి యే ఆత్మను ఈ లోకంలో కట్టివేస్తుంది.

 

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ ।। 14.7 ।।

 

కౌంతేయా, రజో గుణము మోహావేశ స్వభావము. కోరికలతో పుట్టి కామ్య కర్మల పట్ల ఆసక్తి చే బంధించివేస్తుంది.

 

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్  ప్రమాదాలస్యనిద్రాభిః  తన్నిబధ్నాతి భారత  ।। 14.8 ।।

 

ఓ భారతా, తమోగుణము అజ్ఞానము వలన జనించేది. సమస్త బద్ధ ప్రాణాంశలకు (జీవాత్మలకు) నిర్లక్ష్యము (ప్రమాదం), సోమరితనము, మరియు నిద్ర లతో బంధించివేయును.

 

వివరణ:

 

తమోగుణము సరిపోని తయారీ (inadeqate preparation) , అతి విశ్వాసం (over-confidence) మనలోనింపి వైఫల్యానికి దారి తీస్తుంది. (Inadequate preparation and over-confidence lead to failure - this was what my father told me and I put it on the wall with blue back ground and white letters).

 

సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ।। 14.9 ।।

 

అర్థం:

 

ఓ భారతా, సత్వగుణము సుఖములకు కట్టివెయును. రజోగుణము కర్మల పట్ల ఆసక్తితో కట్టివెయును. బుద్ధిని కప్పివేసి వ్యక్తిని మోహభ్రాంతి కి గురిచేసి బంధించివేస్తుంది.

 

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత రజః సత్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ।। 14.10 ।।

సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత ।। 14.11 ।।

లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ।। 14.12 ।।

అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ।। 14.13 ।।

 

అర్థం:

 

ఓ భారతా, సమయాన్ని బట్టి, రజోతమస్సులపై సత్త్వముది పైచేయిగా ఉంటుంది. సత్త్వ, తమోగుణములపై రజో గుణము ఆధిపత్యంతో ఉంటుంది.  ఇంకాకొన్ని సార్లు సత్త్వరజో గుణములను తమోగుణము ఓడిస్తుంది.

ఓ అర్జునా, అన్ని ద్వారముల గుండా జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు, అది సత్త్వ గుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము. రజో గుణము ప్రబలినప్పుడు, ఓ అర్జునా, లోభము (దురాశ), ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత, మరియు యావ పెంపొందుతాయి. అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము, మరియు మోహము - ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు.

 

వివరణ:

 

ద్వారములంటే పంచేద్రియాలు. అవి మనకు ఉన్న ఙ్ఞానము ఇస్తాయి. ఆ ఙ్ఞానమును మనం జ్ఞాపకశక్తి తో నిల్వచేసుకొని, అవసరాన్ని బట్టి వాడుకుంటాము. మనకు ఆస్తులకోసం తాపత్రయం రజో గుణము ప్రబలినప్పుడు కలుగుతుంది.  తమో గుణముతో అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము, మోహము పెంచుకొని బాధలు, యావలు పెంచుకుంటాము. పర్యవసానాలు అనుభవిస్తాము. 

 

కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ రజసస్తు ఫలం దుఃఖమ్  అజ్ఞానం తమసః ఫలమ్ ।। 14.16 ।।

 

సత్వ గుణ కృత్యములలతో పవిత్ర ఫలితములు కలుగును. రజో గుణ కృత్యములతో దుఃఖము కలుగును.  తమో గుణ కృత్యములతో అఙ్ఞానము బయటపడును.

 

సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతోజ్ఞానమేవ చ ।। 14.17 ।।