భగవద్గీత - నాకర్థమైనట్లుగా - 5 (ధ్యానయోగం)

అనాశ్రితఃకర్మఫలంకార్యంకర్మకరోతియఃసన్న్యాసీయోగీనిరగ్నిర్నచాక్రియః।। 6.1 ।।

 

ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను (చేయవలసిన విధులను), చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని, కేవలం అగ్ని హోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరిక క్రియలు త్యజించిన వారు కాదు.

 

యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ హ్యసంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన ।। 6.2 ।।

 

సన్యాసము అని అందరూ అనుకునేది, యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే, ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు.

 

యంసంన్యాసమితిప్రాహుర్యోగంతంవిద్ధిపాణ్డవహ్యసంన్యస్తసఙ్కల్పోయోగీభవతికశ్చన৷৷6.2৷৷

 

వాంఛలు లేని కర్మయోగము సన్యాస యోగముతో సమానము. సంకల్పాలు  వదిలిపెట్టిన వాదే యోగి కాగలడు. ధ్యనయోగిగాదలచినవాడు నిష్కామ కర్మయోగ మార్గములోనే పయనిచాలి. 

 

యదాహినేన్ద్రియార్థేషుకర్మస్వనుషజ్జతే. సర్వసఙ్కల్పసంన్యాసీయోగారూఢస్తదోచ్యతే৷৷6.4৷৷

 

యోగి కాదలచినవాడు, వాంఛలు లేని కర్మలను నిర్వహించుతూ యొగధ్యానములో ఉంటాడు.  

 

ఉద్ధరేదాత్మనాత్మానంనాత్మానమవసాదయేత్. ఆత్మైవహ్యాత్మనోబన్ధురాత్మైవరిపురాత్మనః৷৷6.5৷৷

 

మనస్సు (హృదయం) మనిషి శత్రువు, మిత్రుడు కూడా. ఆ మనసు పై విజయం సాధించినవాడే యోగి.  కామ, క్రోధ, మద, భయ, మాత్సర్యములు మనసులో పుట్టే శత్రువులు.

 

శంకరాచార్య బుద్ధిని గూర్చి వివరిస్తూ, బుద్ధి, మనసు (ఙ్ఞానేద్రియాల మయం), చిత్త (ఙ్ఞానేద్రియానుభవ ఙ్ఞానాగారం),అహంకార (వ్యక్తిగత గుర్తింపు),బుద్ధి (తప్పొప్పుల నిర్ణయించి నిర్ణయాలను చేసేశక్తి కేంద్రం), ఈ శరిరం. బుద్ధితో శరీరాన్ని జయించినవాడే కర్మలపై అధికారం తీసుకుని ఆ  వాంఛాబంధనవిముక్తి పొందినవాడే యోగి.

 

మనస్సు: ఆలోచనలు సృష్టించినప్పుడు, దాని 'మనస్సు' అంటాము.

 

బుద్ధి : ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, దానిని 'బుద్ధి' అంటాము.

 

చిత్తము : ఏదేని ఒక వస్తువు లేదా వ్యక్తితో అనుబంధం ఏర్పరుచుకున్నప్పుడు దానిని చిత్తము అంటాము.

 

అహంకారము : ఎప్పుడైతే అది శరీరానికి సంబంధించిన వాటితో అనుసంధానమై - సంపద, హోదా, అందము, చదువు వంటి వాటి పట్ల గర్వం పెంచు కుంటుందో, దానిని అహంకారము అంటాము. 

 

ప్రతి జీవికి అహంకారం ఉండాలి. అహం అంటే "నేను". నిన్ను నీవు గుర్తించడంతో "అహం". అది ఏ భావనలూ లేకుండా, ప్రాథమిక అవసరాలమీద ఆధారపడి (ఆకలి, దప్పి, అలసట, నిద్ర మొదలైనవి) ఉంటుంది. దానికి శుక్ల పక్ష చంద్రునిలా గర్వం పెంచుకుంటూ కనపడే శరీరంకంటే కనపడని శరీరం పెంచుకుని కర్మేంద్రియ మయమైన శరీరానికి సంబంధించిన సంపద, హోదా, అందము, చదువు వంటి వాటి పట్ల గర్వం పెంచుకుని, అది (దురహంకారం) జీవన పథంలో అంతు తెలియని మెట్లు ఎక్కి పోయే అహంకారము ఆ జీవన అహంకారాన్ని ఎప్పుడో వదిలి పెట్టింది.

 

బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ।। 6.6 ।।

 

మనస్సుని జయించుతే అది అదుపులో ఉంటుంది. లేకుంటే కర్మేంద్రియమయఙ్ఞానై, నీకు శత్రువౌతుంది. 

 

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః ।। 6.7 ।।

 

మనస్సును జయించిన యోగులు శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు లాంటి ద్వందములకు అతీతంగా, ప్రశాంతమైన స్థిర చిత్తముతో ఉంటారు.  

 

జ్ఞానవిజ్ఞానతృప్తాత్మాకూటస్థొవిజితేంద్రియఃయుక్తఇత్యుచ్యతేయోగీసమలోష్టాశ్మకాంచనః ।। 6.8 ।। 

 

తెలిసిన నిజాలకు (సైన్స్ - విజ్ఞాన), తెలియని నిజాలు (ఇంఫర్మేషన్ - జ్ఞాన) విచక్షణ కలిగి సంతృప్తి తో ఉన్నయోగులు, ఇంద్రియములను జయించిన వారై, సమతౌల్యం కోల్పోకుండా సృష్ఠి నంతటిని సమదృష్ఠి చూసేవారైన యోగులు.

 

సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ।। 6.9 ।।

 

మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధి తో ఉంటూ, 

శత్రువుల, బంధువుల పట్ల తటస్థంగా, మరియు, 

పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా - 

 

ఉన్న యోగి మానవులలో సర్వ శ్రేష్ఠుడు గా పరిగణించబడుతాడు.

 

యోగీయుంజీతసతతమాత్మానంరహసిస్థితఃఏకాకీయతచిత్తాత్మానిరాశీరపరిగ్రహః।। 10 ।।   

 

ప్రతి పదార్థము: 

 

యోగీ — ఒక యోగి; యుంజీత — ధ్యానములో నిమగ్నమై; సతతం — ఎల్లప్పుడూ; ఆత్మానం — ఆత్మ; రహసి — ఏకాంతముగా; స్థితః — ఉంటూ; ఏకాకీ — ఒక్కడే; 

యత-చిత్త-ఆత్మా — మనస్సు-శరీరము నియంత్రణలో ఉంచుకొని; నిరాశీ: — కోరికలు లేకుండా; అపరిగ్రహః — భోగ వస్తువులను సమకూర్చుకోవాలనే వాంఛ లేకుండా

 

యోగ స్థితి పొందగొరేవారు మనస్సును స్థిరంగా ఉంచి ధ్యానములో నిమగ్నమై ఏకాంతముగా భోగ వస్తువులను సమకూర్చుకోవాలనే వాంఛ లేకుండా, భౌతిక వాంఛలు లేకుండా ఎల్లప్పుడూ ధ్యానములో నిమగ్నమై ఉంటాడు. 

 

ప్రతి మనిషీ అచేతన కర్మలను, సచేతన కర్మలను ఫలితమాసించక నిర్వహించుతూ యోగాభ్యాసము చేసేవారు ఉత్తములు. వారు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటారు. 

 

యోగ నిర్వహణా స్థానం ఎలావుండాలి అంటే:

 

శుచౌదేశేప్రతిష్ఠాప్యస్థిరమాసనమాత్మనఃనాత్యుఛ్చ్రితంనాతినీచంచైలాజినకుశోత్తరమ్।। 11 

 

యోగాభ్యాసము చేయటానికి

 

1. శుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారుచేసుకోవాలి; 

2. ఆసనం కుశ గడ్డి పై జింక చర్మము దానిమీద ఒక వస్త్రమును వేసుకోవాలి. 

3. ఈ ఆసనము మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు.

 

బ్రహ్మ సూత్రల్లో కూడా ఇలాగే చెప్పబడింది.

 

ఆసీనః సంభవాత్ (4.1.7) “సాధనా చేయటానికి, సరియైన విధానంలో కూర్చోండి”

అచలత్వం చాపేక్ష్య (4.1.9) “నిశ్చలంగా, నిటారుగా కూర్చోండి”

ధ్యానాచ్చ (4.1.8) “ఆ విధంగా కూర్చొని, మనస్సుని ధ్యానంలో కేంద్రీకరించండి”

 

పతంజలి కూడా చేప్పాడు

 

స్థిరసుఖమాసనం (పతంజలి యోగ సూత్రములు 2.46)

 

ఏ పని చేయటానికైనా అనువైన ప్రదేశాన్ని వెతుక్కోవాలి. అటువంటివే మనల్ని జంతువులనుంచి వేరుచేస్తాయి. ఏకాగ్రత సాధించవచ్చు. అనుకున్న గమ్యం (అగమ్యం) చేరవచ్చు. ఇక తప్పని పరిస్థితులైతే ఎక్కడైన ఏకాగ్రతతో ఆ పని చేయాలి. 

 

నాత్యశ్నతస్తుయోగోఽస్తిచైకాంతమనశ్నతఃచాతిస్వప్నశీలస్యజాగ్రతోనైవచార్జున।। 6.16 ।।

 

అన్నం తక్కువగా గాని అతి ఎక్కువగా గాని తింటూ, ఎవరూ ఏకాగ్రత సాధించలేరు. 

 

ఈశోపనిషత్తు లో 

 

అంధంతమఃప్రవిశంతియేఽవిద్యాంఉపాసతేతతోభూయఇవతేతమోవిద్యాయాంరతాః (9)

 

ఒక్క భౌతిక విద్య (materialist education) గాని ఒక్క ఆధ్యాత్మిక విద్య (spiritualistic education) గాని మంచిది కాదు. అవి మనిషికి సరైన మార్గం చూపించవు. 

 

అందుకే పాశ్ఛాత్య దృఢత్వం ప్రాశ్చ బుద్ధి ఉంటే పరిపక్వత వస్తుంది. అవసరమైతే గడ్డిని కూడా తినాలి అంటే, గడ్డినే తినమని కాదు. అలాగే శాకాహారులు మాంసం తినాలని కాదు. 

 

యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః ।। 19 ।।

 

అంటే

 

గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును.

 

కానీ, అది సాధ్యమా? ప్రయత్న లోపం లేకపొతే అది సాధ్యమే. ఆది శంకర అందుకే అంటారు "తస్మాత్ జాగృతా". 

 

తం విద్యాద్ దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా ।। 23 ।।

 

అంటే

 

దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అందురు. ఈ యోగమును ధృడ సంకల్పముతో ఎలాంటి నిరాశావాదం (pessimism) లేకుండా అభ్యాసం చేయ వలెను.

 

మనం సుఖ దుఃఖములకు దూరంగా ఎల్లప్పుడూ ఉండ లేము. కాని యోగాభ్యాసం (మన పనులు) వదిలి వేసి సుఖానికి నవ్వుతూ దుఃఖానికి ఏడుస్తూ ఏ పనీ చేయకుండా ఉండ లేము. మరొకరు మనని ఎందుకు పోషించాలి లేక మన మెందుకు మరొకరి మీదాధార పడాలీ? 

 

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ।। 30 ।।

 

అంటే

 

ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నా యందే దర్శిస్తారో, వారు నన్ను కోల్పోరు, నేను వారిని కోల్పోను.

 

నాఉద్దేశ్యంలో "జీవం" (అదే దైవం నా ఉద్దేశ్యం లో) అన్నిటిలోనూ ఉన్నది. ఆ విషయం గుర్తుంచుకుంటే, సమభావం పెరగటమే కాదు, మనస్సు సమతౌల్యంలో ఉంచుకోగలం కారణం అందరం ఒక్కటే. ప్రాథమిక భావోద్వేగాలు అన్నిజీవాల్లో ఉంటాయి. వాటి నియంత్రణ మనమే (జీవకోటికి శిఖరం మనం కాబట్టి) మొదలుపెట్టాలి. 

 

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ।। 31 ।।

 

అనగా

 

ఎవరైతే అన్ని ప్రాణుల యందు ఉన్న ప్రాణాన్ని గుర్తించి అన్ని ప్రాణులని సమ దృష్టి తో చూస్తారో, వారు ఏ స్థితిలోఉన్నా యోగులే అని అర్థం చేసుకోవాలి. 

 

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః ।। 32 ।।

 

అంటే

 

సర్వ ప్రాణులను సమానముగా చూస్తూ, ఇతరుల సుఖాలకు, దుఃఖాలకు, అవి తనకే అయినట్టు భావించిన వారిని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తారు.

 

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ।। 35 ।।

 

అంటే

 

మనస్సు అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు (అవసరమున్నత వరకు శ్లోకార్థం చెప్పాను)

 

అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తుముపాయతః ।। 36 ।।

 

అంటే

 

మనస్సు అదుపు లో లేనివానికి యోగము కష్టతరమైనది. కానీ, మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్నవారు, మరియు సరియైన పద్దతిలో పరిశ్రమ చేసేవారు, యోగములో పరిపూర్ణత సాధించవచ్చు. ఇది నా అభిప్రాయము.

 

తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ।। 46 ।।

 

అంటే

 

యోగి తపస్వి కంటే గొప్పవాడు.

యోగి ఙ్ఞాని కంటే గొప్పవాడు.

యోగి కర్మ కాండలు చేసే వారి కన్నా గొప్పవాడు.

(అవసరమున్నంత వరకే అర్థం చెప్పా).