Bhagavad Gita As Understood by me Part -8 Raja Vidya

Srinivas Maddali

Raja Vidya

 

భగవంతుడు ప్రజలను ఏ తారతమ్యలూ లేకుండ ఒకేలా చూస్తాడు. రాజధర్మ సారం అదే. ఙ్ఞానం (సాధించిన)మరచి, భక్తితో శరణార్థై (కర్తవ్యానికి) కార్యనిర్వహణే  రాజధర్మం నిర్వహణ.

 

శంకారాచార్య "భజగోవిందం" లో 

 

"సంప్రాప్తే సన్నిహితే కాలే

నహి నహి రక్షతి దుక్కింకరణే"

 

"దుక్కింకరణే" - పొందిన ఙ్ఞానికి గుర్తు. ఙ్ఞానం - చావును ఆపలేదు. కాబట్టి

 

"గేయం గీతా నామ సహస్రం

ధే్యయం శ్రీపతి రూపమజస్రం

నేయం సజ్జ న సంగే చిత్తం

దేయం దీ నజ నాయ చ విత్తం.

 

క్రమం తప్పకుండా గీత, విష్ణు సహస్రనామం స్మరిస్తూ (భక్తి కలిగివుంటూ), కీర్తిగలవారిని, పవిత్రాత్ములను (మునులు, సాంఘికాచార నిర్వాహకులను) గౌరవిస్తూ, తన సంపదలను పేదలకు, అవసరమైన వారికి దాతృత్వంతో పంచుతూ బ్రతుకు గడుపవలెను.  రాజు అంటే పాలకుడు అని అర్థం. ఇప్పటి ప్రపంచంలో, రాజ్యాధికారులు, తన ధర్మం నిర్వహించడంలో భక్తి తో, కీర్తి గలవారిని, పవిత్రాత్ములను (మునులు, సాంఘికాచార నిర్వాహకులను గౌరవిస్తూ, తన సంపదలను పేదలకు, అవసరమైన వారికి దాతృత్వంతో పంచుతూ బ్రతుకు వలెను.

 

ఇదే అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోడీ కి 2002 మతపరమైన సంఘర్షణలు ఆపడంలో నిర్వహించమన్న రాజధర్మం. 

 

ఈ రాజ ధర్మమే ఈ అధ్యాయంలో కృష్ణార్జున సంవాదంలో ఆలోచనా ప్రవాహ మలుపు.  

 

రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్৷৷9.2৷৷

 

ఈ భూమిమీద జీవ ఎన్నో క్రామాలు జరిగుతున్నాయి.  ఈంతవరకు అంతరించిపోయిన జాతులన్ని ప్రకృతిలో కలసిపోయాయి. క్రొత్తజాతులు పుడతాయి ఆప్రకృతి నుంచే, అది ప్రకృతిధర్మం. అది పరబ్రహ్మ నుంచి వచ్చిన ఒక గుణం. జీవాలు వాటి వాటి స్వభావాలకు అనుగుణంగా, మరల మరల ఉత్పతౌతాయి.. "జీవి" ఈ గ్రహం ఎలా పునరుత్పత్తి కావాలో ప్రకృతి నిర్ణయాల్తోఏకికృతమౌతూ ముందుకుపోతుంది. దానిని ఎవ్వరూ ఆపలేరు. "జీవి" ఆరంభాన్ని, అంతాన్ని తెలిసినవారు లేరు, అంచనాలు వేయగలిగిన వారున్నారుగాని.  అంతరించిన కొన్నిజాతు తమకు నచ్చినవిధంగా చూపినవారూ, చూపేవరున్నారుగానీ. మనం చూసిన "జురాసిక్ పార్క్" ఒక ఉదాహరణ.  శాస్త్రఙ్ఞులు డైనోసార్స్ ఈకలు గల జంతువులంటారు. ఏదినిజం తెలియదు. శిలాజాలు అన్నీ అస్తికలే గాని శరీరధర్మాలను వర్ణించలేకుండా ఉన్నాయి. అంతెందుకు, మనకి ఇప్పటికీ, ఏజాతి తర్వాత మనవోద్భ్వం జరిగిందో తెలియదు.

ఇప్పటికీ పరిణామక్రమంలో మానవునకూ ఆ ముందు జాతికీ బంధం (link) తెలియదు.  

 

జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ।। 9.15 ।।

 

పరబ్రహ్మను ఙ్ఞానాన్వేషకులు యఙ్ఞములలో నిమగ్నమై చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అబేధమైన ఏకత్వముగా చూస్తారు, మరికొందరు నన్ను తమకంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు నా యొక్క విశ్వ రూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు.

 

1. ఆహం బ్రహ్మస్మి - నేనే పరబ్రహ్మను (యజుర్ వేద 1.4.10, బృహదరణ్యక ఊపనిషత్) - అద్వైత సిద్ధంతం.

2. ద్వైత - పృథక్త్వేన - పరబ్రహ్మ లేక పరమాత్మ మఱియు జీవాత్మ వేరు వేరు. 

3. బహుధా విశ్వతోముఖమ్ - విశ్వ రూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఒక రూపం ఆరాధిస్తారు. బహుదేవతారాధన చేసే వారు ఆ పరబ్రహ్మ ప్రతిబింబాలను (in polytheism all gods are reflections of parramatma)ఆరాధించి ముక్తిపొందుతారు.