Bhagad Gita As Understood By Me - Part 11
(kshEtrm kstregna yogam - chapter 13)
(Srinivas Maddali)
క్షేత్ర నిర్వచనం:
ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్బ్హ్మ సూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ।। 13.5 ।।
మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః ।। 13.6 ।।
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ।। 13.7 ।।
మహా ఋషులు, వేదములు, బ్రహ్మ సూత్రములు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి న సత్యమును పెక్కువిధముల వివరించి ఉన్నారు. ఎన్నోవేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది. సహేతుకముగాకూడా చెప్పబడినది.
మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః ।। 13.6 ।।
1. పంచ మహా భూతములు,
2. అహంకారము,
3. బుద్ధి,
4. అవ్యక్త మూల ప్రకృతి,
5. పదకొండు ఇంద్రియములు (ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు), మరియు
6. ఐదు ఇంద్రియ గ్రాహ్య విషయములతో
ఈ యొక్క క్షేత్రము ఉన్నది.
ఆ పైవి మొత్తం 19.
ఐదు ఇంద్రియ గ్రాహ్యములు:
1. కన్ను - కనపడే అన్ని ఆకారములను సమాచారంగా నిల్వ చేసే సాధనము.
2. ముక్కు - శ్వాస తో పాటు వాసనలను సమాచారంగా నిల్వ చేసే సాధనము.
3. చెవి: కంపన తరంగాలను అర్థం అయ్యే భాషలోకి, వివిధ వస్తువుల, భాషలేని జంతువుల, పరిమిథమైన భాషలో అర్ధవంతంగా సంభాషించే జంతువుల సమాచారంగా నిల్వ చేసే సాధనము.
4.నోరు (పళ్ళు, నాలుక,స్వరపేటిక కలిపి): శబ్దం చేయదానికి శబ్దపేటికనుపయోగించి కంపన తరంగాల ద్వారా జంతువు మనిషి. అందుకు నోటిలోని అన్ని భాగాలనీ స్వర పేటికద్వారా.
ఈ విధంగా పంచేంద్రియలు ఉతపాదకంగా, ఉతపత్తిగా. ఉతపత్తి బుద్ధితో గ్రహించిన సమాచారం ఆధారంగా, అనుభవాలు కలిపి తార్కికంగా అన్వయించు కొని శబ్దోత్పత్తి, కార్యోత్పత్తి, సృష్ఠిస్తాడు.
అప్పుడు ఫలాపేక్షతో క్షేత్రఙ్ఞుడౌతాడు. ఇఛ్చ మరియు ద్వేషము, సంతోషము మరియు దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము - ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు (వికారములు) అనబడుతాయి.
అమానిత్వమదంభిత్వమ్ అహింసా క్షాంతిరార్జవమ్ ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ।। 13.8 ।।
ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ ।। 13.9 ।।
అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్టానిష్టోపపత్తిషు ।। 13.10 ।।
మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ ।
వివిక్తదేశసేవిత్వమ్ అరతిర్జనసంసది ।। 13.11 ।।
అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ ।
ఏతద్ జ్ఞానమితి ప్రోక్తమ్ అజ్ఞానం యదతోఽన్యథా ।। 13.12 ।।
నమ్రతతో, దంభాలు లేకుండా, అహింస, క్షమాగుణం, నిరాడంబరత, గురు సేవ, దేహం మనసు శుద్ధితో, ఆత్మనిగ్రహము గలిగి, ఇంద్రియ గ్రహితఙ్ఞానం పట్ల వైరాగ్యము తో, అహంకార రహితముగా, జన్మ, మృత్యు, జరా, వ్యాధుల దురవస్థను గుర్తుచేసుకోవటం; మమకారరాహిత్యం; భార్య(భర్త), తన ధర్మంగాకాకుండాగా వాటిని అంటుకొని (యావ) ఉండుట, అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట; శరణాగతి తో నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట; ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి కలిగి వాని మధ్య ఉన్నా ఏకంతం అనుభవిచడనికి ఇసటపదటాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానములో అచంచల విశ్వాసం, మరియు పరమ సత్యముకై తత్త్వాన్వేషణ - ఇవన్నిన్ని జ్ఞానము మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానము.
.....అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ।। 13.13 ।।
సత్యాసత్యములకావలి పరబ్రహ్మము అనాదై ఉన్నది.
.... సర్వమావృత్య తిష్ఠతి ।। 13.14 ।।
ఆ పరబ్రహ్మ అంతటా ఉన్న శక్తి. (energy).
సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ।। 13.15 ।।
ఇంద్రియములు ఉన్న, అందు ఆసక్తి లేకపోయినా వాటి సృష్ఠి కర్త అతడే. ప్రాకృతిక త్రిగుణ సృష్ఠి కర్తైన నిర్గుణుడు.
బహిరంతశ్చ భూతానామ్ అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ ।। 13.16 ।।
పరమాత్మ సర్వ భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. ఆతని సూక్ష్మత అర్థంకాదు. దూరంగాఉండి దగ్గరలో ఉండేవాడతడు.
అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ భూతభర్తృ చ తద్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ।। 13.17 ।।
పరమాత్మ (prana) అవిభక్తుడు. సర్వ భూతములలో విభక్తంగా (pranaasa) ఉన్న శక్తి. (energy) ఆ పరమాత్మే సృష్టి, స్థితి, లయకాలుడు. (recollect Vemulavada Bhimakavi) అది తెలిసికొనవలసిన నిజము.
ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్ ।। 13.20 ।।
వివరణ:
ఈ భూమిపై అనాదిగా ప్రకృతి పురుషుడు ఉన్నరు. భూమి ఎల్లప్పుదు ప్రకృతి పాత్ర పొషించుతూ ఉంది. ఫ్రణం భ్రహ్మం. అది ఎందుకు ఇక్కడ పుట్టిందో ఇంకాఎక్కడౌందో ఇంతవరకు ప్రమేయాలే కాని నిజం తెలియదు. ఇంకాఎక్కడైనా ప్రాణి చూడగలిగితే, అక్కడి వాతావరణాన్ని బట్టి ఇక్కడి ఇప్పటి ప్రమేయాలో నిజమ తెలుస్తుది. ప్రాణి లో మార్పులు (పరిణమక్రమంలో) భోఉతికావసరలే. ప్రకృతిని తనవంతుగా అనుభ్వించడానికి ప్రణం తగిన మార్పులు పొదుతు పరిపక్వ దస కు చేరుతుంది. అది ప్రకృతి పురుషుల సమావగాహన.
కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ।। 13.21 ।।
వివరణ:
సృష్టిలో ప్రతి సంభావన ఏదొ కార్య కారణ భౌతికంగా హేతువుతో ప్రాణమున్న లేకున్న జీవధారమైన రూపమే బాధ్యుడు. అది ఒక భౌతిక మైన రసాయనిక (biochemistry) ధర్మం.
పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోనిజన్మసు ।। 13.22 ।।
వివరణ:
ప్రకృతి మరియు పురుష సమాగమం ఒక మమకారాసక్తి పెంచి ఫలాపేక్ష గాని ఫలాపేక్షారహిత్యం తో గాని సగుణాత్మక జీవ కారణమౌతోంది.
సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ।। 13.28 ।।
వివరణ:
ప్రతి జీవంలోనూ పరమాత్మను (అందులో చూసే వాడు కూడా ఉంటాడు) చూస్తే భావొద్వేగతావేశాలలో కొట్టుకు పోము. అది నిజము.
......న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ।। 13.29 ।।
తమ మనస్సుచే తమను తామే దిగజార్చుకోరు. తద్వారా, వారు పరమ పదమునకు (ప్రశాంతమైన మరణం) చేరుకుంటారు.
యదా భూతపృథగ్భావమ్ ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ।। 13.31 ।।
వివరణ:
ప్రాణులు అన్ని ఒకచోట నుంచి వచ్చినట్లు తలచేవారు బ్రహ్మ ఙ్ఞానం పొందినవారే.
యదా భూతపృథగ్భావమ్ ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ।। 13.31 ।।
వివరణ:
ప్రాణులు అన్ని ఒకేచోటు నుంచి వచ్చినట్లు తలచేవారు బ్రహ్మ ఙ్ఞానం పొందినవారే.
ఆధునిక విఙ్ఞానం కూడా ఏకలింగ జీవంగా ప్రయాణం మొదలుపెట్టి పరిణామక్రమంలో వృక్ష జంతుజీవాలుగా మనకు ఇప్పటి సృష్ఠి కనపడుతుంది.
యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ।। 13.33 ।।
అర్థం:
ఆకాశము (ఖాళీ జాగా) అన్నింటిని తనలోనే కలిగిఉంటుంది, కానీ సూక్ష్మమైనది కావటం వలన, తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితముకాదు. అదే విధముగా, దేహములో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్నా, ఆత్మ అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు.
వివరణ:
ఆకాశము అంటే ఆక్రమిత & అనాక్రమిత ఖగోళం. ఎన్ని నక్సత్రాలున్నా, ఎన్ని నక్షత్ర మండలాలున్నా ఇంకా ఎన్నింటికి చోటు ఉందంటే తెలియదు. దాన్నే అనOతం అంటాము. నేను ఒకప్పుడు, అనంతం అంటే లెక్కపెట్టలేని లేక అర్థంకానన్ని పరిమిత కేంద్రాల మొత్తం మరియు అక్రమిచబడని విశాల అనంత ఖగోళం. అందుకేనేమో విశ్వాన్ని వేదాలు బ్రహ్మాండం అని వర్ణిస్తాయి. ఖగోళ గర్భంలో ఎన్ని మార్పులు జరుగుతున్నా ఖగోళాం కళంకితముకాదు. అటే, విఙ్ఞానం ఉపయోగించటంలో దోషాలు విఙ్ఞానంవి కావు. ఆత్మ (ప్రాణం) అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు.