BhagavadGita AsUnderstoodByMe

జ్ఞానవిజ్ఞానయోగము - 7 అధ్యాయము

Srinivas Maddali

 

 

ముందుమాట

 

In this chapter Vyasa’s creative ability and flow of philosophical thought can be followed. 

 

జ్ఞాన విజ్ఞాన యోగములో "నేను" పదము చాలా ఎక్కవగా వాడబడుతుంది. కాబట్టి, ముందుగా "నేను" గూర్చి చెప్పాలనుకుంటున్నా. - Vyasa’s creative philosophical concentrated extending self is “I”.

 

"నేను" అనేది చూచేవాడు, చూడబదే వాడు గూర్చిన చర్చలో ఉంది. సంకుచితంగా మాట్లడితే ఒక కుటుంబంలో చాలా చిన్న (సూక్ష్మ) పాత్ర. సంభందాలను ప్రాధ్మిక దసలో "నేను" తొ మొదలైతాయి. కాబట్టి "నేను" ఒక "అంతర్గత" పాత్ర. "నేను" ను "విస్తరించు" కుంటూ పొతే బహిర్గతగా గుర్తించే పాత్రలు అంతర్గతమౌతాయి. దాని అర్థ్మ్ "నేను" వ్యపించుతు పొతుంది. అలా వ్యపించుతూ, ఒక దస లో, కనబదే విస్వమంతా "నేనె" అవుతుంది. ఆలా విస్తరించీన "నేను" అని కృష్ణుడు. కృష్ణుని విశాలదృక్పథం ఇక్కద తెలుస్తుంది. శ్రీక్రృష్ణుని పాత్రని "భాగవత కృఇష్ణుడు", "భారత కృఇష్ణుడు" గా చుస్తే ఒక పౌరణిక "భాగవత" పాత్ర, రాజనీతిజ్ఞుడు, సంఘ సంస్కర్త అయిన "భారత" పాత్ర. సామాజిక స్పృహ తో "భారత కృష్ణుడు" ద్రౌపదీ వస్త్రాపహరణం కి వ్యతిరెకంగా మొదలుపెట్టి కురుక్షేత్ర యుద్ధం వరకు అతనిపాత్ర చాలా అర్ధవంతమైనది. అతనై హత్య తెలిసిచేసినా తెలియక చేసినా, అటువంటి పాత్రలకు చరిత్రలో అటువంటి ముగింపులేచూస్తాము. రాముడి ముగింపు సరయూ నది లో, పాందవుల ముగింపు హిమాలయాల్లో. చాలా సందర్భాలలో నాటి నుంచి నేటి చరిత్రవరకు (అంతే గాంధీ - హిందూ ముస్లిం సమైకతానినాదం వలన, ఇందిరా -అమె జర్నైల్ సింగ్ భింద్రన్ వాలె -ఖలిస్తన్ ను అపినందుకు - అమృత్సర్ సిఖ్ దేవాలయమె లో దాగిఉన్నవారిని చంపినందుకు - మతరాజకీయాలు బహిర్గతంగా విచ్చలవిడిగా విభజన తర్వాత ఇంతమొత్తంలో సమీకరణ జరగలేదు, రాజివ్ గాంధి - ఎల్టిటిఈ - శ్రీలంక నైసర్గిక స్వరూపం కాపాడాలని - శాంతి పరిరక్షణ దళాలు శ్రీలంకకు పంపటంవలన, అబ్రహం లింకన్ - బానిసత్వాన్ని రద్దు చేయటంవలన,ఎల్బీ శాస్త్రి, నేతాజి, కాశ్మీర్ కు వెళుతున్న శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఇలా ఎందరో చనిపోయారు). వీరికి కృష్ణునికి ఏ రకమైన పోలికా లెదు. ఉదాహణకి కొన్ని చరిత్రలోని అంశాలు చెప్పా - అంతే. ఈ అధ్యాయాన్ని "జ్ఞాన విజ్ఞాన యోగము" విశాలమైన దృష్టితో చూడాలి అనుకొంటా. అప్పుడే మనము ఆధ్యాత్మిక రూపం నుంచి అసలైన సాంఘిక అర్థం చెప్పగలమేమో నని అనిపిస్తుంది.

 

 

మనుష్యాణాంసహస్రేషుకశ్ిచద్యతతిసిద్ధయేయతతామపిసిద్ధానాంకశ్చిన్మాంవేత్తితత్త్వతః৷৷7.3৷৷ 

 

వేలమందిలో ఒక్కడు పరిపూర్ణతకు ప్రాకులాడుతాడు. వారి లో కూడ కొందరే తమ బహిర్గత ప్రపంచాన్ని అంతర్గత ప్రపంచంగా మార్చు కుంటారు. వారే ఈ విశ్వాత్మౌతారు (Universal I), సామాజికసృహతో సమాజానికి సాయపడతారు.

 

భూమిరాపోనలోవాయుఃఖంమనోబుద్ధిరేవఅహఙ్కారఇతీయంమేభిన్నాప్రకృతిరష్టధా৷৷7.4৷৷

 

కృష్ణతనదైనవిధానంలోతనను ("నేను" ను) పొడిగించుతూపోతాడు. Vyasa’s creative ability and flow of philosophical thought can be followed.

 

భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము,  మనస్సు, బుద్ధి అహంకారము - ఇవి భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు.ఇవి నేనే. 

 

......జీవభూతాంమహాబాహోయయేదంధార్యతేజగత్৷৷7.5৷৷

 

ఈ ప్రాణాంశాశక్తి, ఇది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన  కలిగి ఉంటుంది.

 

ఏతద్యోనీనిభూతానిసర్వాణీత్యుపధారయఅహంకృత్స్నస్యజగతఃప్రభవఃప్రలయస్తథా৷৷7.6৷৷

 

ఏతత్ యోనీని = ఈ రెండు (శక్తులు) మూలాధారము

భూతాని = ప్రాణులు

సర్వాణి = సమస్త

ఇతి = అది

ఉపధారయ = తెలుసు కొనుము

అహం = నేను

కృత్స్నస్య = సమస్త

జగతః = సృష్టి (జగత్తు)

ప్రభవః = ఉత్పత్తిస్థానము

ప్రలయ = లయము

తథా = కూడా

 

ప్రకృతి సృష్టికి, లయకు తానే కారణము. ఈ రెండు (సృష్టి, లయ) శక్తులకు ఆధార భూతమైనది. 

 

.....మయిసర్వమిదంప్రోతంసూత్రేమణిగణాఇవ৷৷7.7৷৷

 

పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి.

 

రసోహమప్సుకౌన్తేయప్రభాస్మిశశిసూర్యయోఃప్రణవఃసర్వవేదేషుశబ్దఃఖేపౌరుషంనృషు৷৷7.8৷৷

 

మత్తః = నా కంటే

పరతరం = ఉన్నతమైనది

న = లేదు

అన్యత్ = ఇతర 

కించిత్ = కొంచముకూడా

అస్తి = ఏదియునూ లేదు;

ధనంజయ = అర్జునా ధనమును (రాజ్యము  కూడా ఒక ధనమే) జయించే వాడా

మయి = నా యందే

సర్వం = సమస్తము

ఇదం = మనకు కనిపించే ఇవి

ప్రోతం = ఆధారపడి (దూర్చబడి) ఉన్నవి

సూత్రే = దారం పై

మణి-గణాః = ముత్యములు

ఇవ = లాగా

 

దారములేనిదే ముత్యాలదండలేదు. అట్లే, సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి.

 

బీజంమాంసర్వభూతానాంవిద్ధిపార్థసనాతనమ్బుద్ధిర్బుద్ధిమతామస్మితేజస్తేజస్వినామహమ్৷৷7.10৷৷

 

అన్ని ప్రణాంశలలోనొ ప్రాణము ఆదిమ బీజం, వివేచనగల బుద్ధి, తెలివైనవారి ప్రకాశము అతడే.

 

బీజంమాంసర్వభూతానాంవిద్ధిపార్థసనాతనమ్బుద్ధిర్బుద్ధిమతామస్మితేజస్తేజస్వినామహమ్৷৷7.10৷৷

 

అన్ని ప్రణాంశలలోనొ ప్రాణము ఆదిమ బీజం, వివేచనగల బుద్ధి, తెలివైనవారి ప్రకాశము అతడే.   

 

బలంబలవతామస్మికామరాగవివర్జితమ్ధర్మావిరుద్ధోభూతేషుకామోస్మిభరతర్షభ৷৷7.11৷৷

 

బలవంతులలో కామరాగరహితమైన బలము నేను. ధర్మ విరుద్ధము కాని లైంగిక క్రియలను అతదే.

 

యేచైవసాత్త్వికాభావారాజసాస్తామసాశ్చయేమత్తఏవేతితాన్విద్ధినత్వహంతేషుతేమయి৷৷7.12৷৷

 

భౌతిక ప్రకృతి యొక్క వ్యక్తమయిన త్రిగుణములు – సత్త్వము, రజస్సు, తమస్సు ల మూలశక్తి  అతడే. ఆ మూలశక్తి దానినుండి పుట్టిన ఆ మూడు గుణములకు అతీతము. 

 

త్రిభిర్గుణమయైర్భావైరేభిఃసర్వమిదంజగత్మోహితంనాభిజానాతిమామేభ్యఃపరమవ్యయమ్৷৷7.13৷৷

 

ఈ విశ్వమంతా త్రిగుణ (సత్వ, రజ, తమొ) - ఈ ప్రకృతి యొక్క గుణాలు -భ్రమలో, ప్రాణశక్తిని (పరమాత్మ) ను గుర్తించడంలో విఫలం ఔతారు. మూల ప్రాణశక్తి అవ్యయము, అజరము, పరివర్తనా రహితము. కనబడే సృష్టికి ఆవల ఉన్న ఆ శక్తిని త్రిగుణాత్మక మయా ప్రధాన ఈ కనబడే సృష్టి  చూడలేదు. 

 

దైవీహ్యేషాగుణమయీమమమాయాదురత్యయామామేవయేప్రపద్యన్తేమాయామేతాంతరన్తితే৷৷7.14৷৷

 

దైవీ = దివ్యమైన

హి = నిజముగా

ఏషా = ఈ యొక్క

గుణ-మయీ — ప్రకృతి త్రి గుణములతో కూడిన మమ = నా యొక్క

మాయా = మాయ, భగవంతుని శక్తులలో ఒకటి భగవత్ ప్రాప్తి పొందటానికి ఇంకా అర్హత సాధించని ఆత్మల నుండి భగవంతుని నిజమైన స్వభావాన్ని దాచి ఉంచునది

దురత్యయా = అధిగమించటానికి చాలా కష్టతరమైనది

మాం = నాకు

ఏవ = ఖచ్చితంగా

యే = ఎవరైతే

ప్రపద్యంతే = శరణాగతి చేసెదరో

మాయాం ఏతాం = ఈ మాయ

తరంతి = దాటిపోవురు

తే = వారు

 

బమ్మెరపోతన - భ్గవతము - గజేంద్రమోక్షములోనిపద్యం

 

లోకంబులు లోకేశులు

లోకస్థులు దెగినతుది నలోకంబగు పెం

జీకటి కవ్వలనెవ్వం

డేకాకృతి వెలుంగు నతని నే సేవింతున్

 

ఎవ్వనిచే జనించు జగము? ఎవ్వనిలోపలనుండు లీనమై?

ఎవ్వనిండుదిండు? పరమేశ్వరుడెవ్వడు?మూలకారణం 

బెవ్వడు? అనాదిమధ్యలయుడెవ్వడు? సర్వము తానెఐన వా

డెవ్వడు? వానిన్, ఆత్మభవునిన్, ఈశ్వరిన్ నే శరణంబు వేడెదన్!

 

శ్వేతాశ్వతరఉపనిషత్తు

 

మాయాం తు ప్రకృతిం విద్యా

న్మాయినం తు మహేశ్వరమ్‌ - (4.10) 

—ఇదివరలో ఈ శ్లోక పాదాల్ని వివరంగాచూశాము

 

రామాయణంఇలాపేర్కొంటున్నది:

 

సో దాసీ రఘుబీర కై 

సముఝేం మిథ్యా సోపి

 

కొంతమంది అనుకుంటారు, మాయ అనేది మిథ్య (లేనిది) అని, కానీ నిజానికి అది భగవత్ సేవలో నిమగ్నమయిన శక్తి స్వరూపం.

 

....దుష్కృతినోమూఢాఃప్రపద్యన్తేనరాధమాః. మాయయాపహృతజ్ఞానాఆసురంభావమాశ్రితాః৷৷7.15৷৷ 

 

మూల ప్రాణ శక్తిని (నన్ను)  

 

1. దుర్మార్గులు

2. అఙ్ఞానులు

3. మూలప్రాణశక్తిని తెలుసుకునే సామర్ధ్యం ఉన్నా సోమరితనం తో తమ నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు

4. బుద్ధి భ్రమకు గురైనవారు

5. ఆసురీ ప్రవృత్తి కలవారు

 

చేరాలని కోరుకోరు. చేరలేరు. శరణాగతి చేయరు.

 

 

....సుకృతినోర్జునఆర్తోజిజ్ఞాసురర్థార్థీజ్ఞానీభరతర్షభ৷৷7.16৷৷

 

సు-కృతినః=ధర్మ పరాయణులు

అర్జున = అర్జునా

ఆర్తః = ఆపద/దుఃఖం లో ఉన్నవారు

జిజ్ఞాసుః = జ్ఞానాన్ని అన్వేషించేవారు

అర్థ+అర్థీ = అరర్థార్థీ = భౌతిక సంపత్తి ఆశించేవారు

జ్ఞానీ = జ్ఞానములో స్థితులై ఉన్నవారు

చ — మరియు

భరత = భరత వంశజుడా  

రిషభ = వృషభం = వృషభం  (ఆలంకారికంగా బలమైనవాడా)

భరత + రిషభ = భరతర్షభ  

   

 

జ్ఞాన (సమ + ఉప + ఆర్జన=సముపార్జన) కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, మరియు జ్ఞానము నందు స్థితులై ఉన్న వారు.

 

 

కామైస్తైస్తైర్హృతజ్ఞానాఃప్రపద్యన్తేన్యదేవతాఃతంతంనియమమాస్థాయప్రకృత్యానియతాఃస్వయా৷৷7.20৷৷

 

 

స్వాభావికమైన ప్రకృతి నియత్రిచబడి ఙ్ఞానం కోల్పోయిన లౌకిక-ఙ్ఞానులు కొర్కెలు తీర్చుకుంటానికి వెరు దేవతలని ప్రర్ధిస్తారు, ఇతర ఙ్ఞాన విభాగాల ను అనుసరించి.  

 

 

అన్తవత్తుఫలంతేషాంతద్భవత్యల్పమేధసామ్దేవాన్దేవయజోయాన్తి............||7.23||

 

అంత-వత్ = నశించిపొయెడి

తు = కానీ

ఫలం = ఫలము

తేషాం = వారిచే

తత్ = అది

భవతి = ఉండును

అల్ప-మేధాసాం = తెలివి తక్కువ వారు

దేవాన్ = దేవతలకు

దేవ-యజః = దేవతలను ఆరాధించేవారు

యాంతి = వెళ్ళెదరు.

 

కానీ ఈ అల్ప-జ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించే వారు ఆయా దేవతల లోకానికి వెళతారు.

 

 

ఇచ్ఛాద్వేషసముత్థేనద్వన్ద్వమోహేనభారతసర్వభూతానిసంమోహంసర్గేయాన్తి ... ৷৷7.27৷৷

 

 

వ్యతిరేకమైన ద్వందములు రాగ, ద్వేషములు మోహము (కోరిక) భ్రాంతి నుంచి పుడతాయి. జీవులు పుట్టుక నుంచి వీటిచే (రాగ, ద్వేషములు) భ్రమింపజేయ బడుచున్నవి. 

 

 

చివరిమాట:

 

ప్రాణాంశలు (జీవాత్మలు) ప్రాణశక్తిని (పరమాత్మ) సమస్త అధిభూత (పదార్థ క్షేత్రము), అధిదైవ (దేవతలు), మరియు అధియజ్ఞము (యజ్ఞములకు) వహించు అధినేతగా ప్రాణశక్తిని (పరమాత్మ) ను పరిగణిస్తారు. ఆ ప్రాణాంశలు (జీవాత్మలు) మరణంలోకూడా తమ మానసిక స్థిరత్వమును కోల్పోవు.