BhagavadGitaAsUnderstoodByMe - Part -15
(16వఅధ్యాయము: దైవాసురసంపద్విభాగయోగము)
Srinivas Maddali
అభయంసత్త్వసంశుద్ధిఃజ్ఞానయోగవ్యవస్థితిఃదానందమశ్చయజ్ఞశ్చస్వాధ్యాయస్తపఆర్జవమ్।। 16.1 ।।
అహింసాసత్యమక్రోధః త్యాగఃశాంతిరపైశునమ్దయాభూతేష్వలోలుప్త్వంమార్దవంహ్రీరచాపలమ్।। 16.2 ।।
తేజఃక్షమాధృతిఃశౌచమద్రోహోనాతిమానితాభవంతిసంపదందైవీమభిజాతస్యభారత।। 16.3 ।।
న+భయము=నిర్భయత్వము,
అంతఃకరణ శుద్ధి,
జ్ఞానము, యోగి, దృఢ సంకల్పము, దాన గుణము,
దమః=ఇంద్రియ నిగ్రహము,
స్వాధ్యాయః= స్వయం గ్రంథాధ్యయనము
ధృఢసంకల్పము,
దానము,
ఇంద్రియ నిగ్రహము,
తపస్సు,
నిష్కాపట్యయం,
అహింస,
సత్య సంధత,
క్రోధము లేకుండుట,
త్యాగము,
శాంతి,
ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట,
సర్వ ప్రాణులపట్ల దయ,
దురాశ లేకుండుట,
సౌమ్యత,
అణుకువ,
నిశ్చలత్వము,
బలము,
క్షమాగుణము,
మనఃస్థైర్యము,
శౌచము=పరిశుభ్రత,
అద్రోహః = ఎవరిపట్లా శత్రుత్వం లేకుండుట,
న + అతి-మానితా = డాంభికము లేకుండుట
వంటి గుణములు
దైవీ సంపద కలవారి లక్షణములు.
దంభోదర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానంచాభిజాతస్యపార్థ సంపదమాసురీమ్ ।। 16.4 ।।
అర్థము:
దంభము, దర్పము, అహంభావం, క్రొధము, మొరటుతనము, నిజముగా అజ్ఞానం మరియు రాక్షసము (న+సురీం=అసురీం), ఓ పృధపుత్రా.
....బంధాయాసురీమతా....16.5
....ఆసురీ గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణ మవుతాయి...
ప్రవృత్తించనివృత్తించజనానవిదురాసురాఃనశౌచంనాపిచాచారోనసత్యంతేషువిద్యతే।। 16.7 ।।
మంచి నడవడికకు మరియు చెడు నడవడికకు ఆసురీ స్వభావము కలవారు స్వచ్ఛత లేకుండా, సత్య సంధత లేకుండా ఉండెదరు.
అసత్యమప్రతిష్ఠంతేజగదాహురనీశ్వరమ్అపరస్పరసంభూతంకిమన్యత్కామహైతుకమ్।। 16.8 ।।
అర్థము:
అసత్యం, అశౌచం అసుర లక్షణాలు. ఎంటువంటి ఆధారము లేకుండా, (అప్రతిష్ఠం), కారణం లేకుండా ఉద్భవించినది (జగదాహురనీశ్వరమ్) ఏమి ఉంది? ఏ ప్రపంచమంతా స్త్రీ-పురుష సంయోగము వల్లనే ఉద్భవించినది మరియు లైంగిక తృప్తి (కామహైతుకమ్) కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు. ఇవన్నీ అసుర లక్షణాలు.
వివరణ:
విశ్వ సృష్ఠికి ప్రత్యేకించి కారణం లేదని, అది “స్వయంభూ” అని కొందరు శాస్త్రవేత్తల (స్తేఫెన్ హాకింగ్స్ తో సహ చాలామంది) అభిప్రాయం. ఐన్ స్టీన్ "దేవుడు ఎప్పుడూ జూదం ఆడడు" అన్నాడు. అది తప్పు. కృష్ణ బిలములపై క్వాంటం ప్రభావాలు (quantum effects) పరిశిలిస్తే "దేవుడు జూదం ఆడటమేకాదు, కొన్నిసార్లు మనల్ని తప్పు దోవ పట్టించడానికై పాచికలు మనం చూడకుండా వేస్తాడు" - స్టీఫెన్ హాకింగ్స్ - from "God Played Dice".
కాని వైదిక సాంప్రదాయం లో అటువంటి వారిని ఆసురీ గుణములు కలవారు అంటారు. "అలైంగిక పునరుత్పత్తి ఏక కణ మరి కొన్ని బహుకణజీవుల్లోనే సాధ్యము". ఇది మనం జీవశాస్త్రం తెలుసుకుంటాము.
కామమాశ్రిత్యదుష్పూరందంభమానమదాన్వితాఃమోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ప్రవర్తంతేశుచివ్రతాః।। 16.10 ।।
అర్థము:
కామమాశ్రిత్య = కోరికలునిండి
దుష్పూరం = తృప్తిపరచలేని
దంభ + మాన + మద-అన్వితాః = కపటత్వం,
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్
మొహత్ + గృహీత్వా + అసత్ + గ్రాహాన్ =
మోహమునకు గురై, ఆకర్షితులై, తాత్కాలికమైన (అసత్ అంటే అసత్యం అని కాకుండా తాత్కాలికము అని) విషయములయందు ఆకర్షితులై
అశుచి-వ్రతాః — అపవిత్ర సంకల్పంతో
ప్రవర్తంతే = ప్రవర్తించెదరు.
వివరణ:
కోరికల సముద్రంలో ముణిగి తాత్కలికమైన మోహమునకు మనిషి బానిసౌతాడు. భౌతిక వాదములో మోహము, భౌతిక సంతృప్తి ముఖ్యం. దానిని "అపవిత్ర బుద్ధి" గా భగవద్గీత, వైదిక సాంప్రదాయం భావిస్తాయి.
ఇదే భౌతిక వాదానికి (పాశ్చాత్య వాదము) అధ్యాత్మ వాదానికి (ప్రశ్చ్య-వైదిక తత్వశాస్త్రం) ఉన్న బేధము.
చింతామపరిమేయాంచప్రలయాంతాముపాశ్రితాఃకామోపభోగపరమాఏతావదితినిశ్చితాః।। 16.11 ।।
చింతలు చివరికి మరణం తోనే ముగుస్తాయి. కామ-ఉపభోగ జీవిత ప్రయోజనము ఏతావత్ + ఇతి నిశ్చితాః = ఇదే జీవిత పరమార్థమనే నిర్ణయాత్మక ధోరణి లో ఉంటారు.
వివరణ:
బౌద్ధం లో ఇదే వుంది కదా. మతపరమైన ఆచారాలను (యఙ్ఞ యాగాదులను) బౌద్ధం వ్యతిరేకిస్తుంది. కానీ, ఇప్పుడు బౌద్ధం లో కుడా మతపరమైన ఆచారాలున్నాయి.
దానికొరకు జంతు హింసను వ్యతిరేకిస్తుంది బౌద్ధం. యఙ్ఞయాగాదుల్లో హింసను భగవద్గీత ఎక్కడా చెప్పదు.
వైదిక మతాన్ని పునరుద్దిపన కొరకు వచ్చిన మార్పులతో వ్రాయబడ్డ వైదికసైద్ధాంతిక గ్రంథమా భగవద్గీత అని నాకో సంశ ఉంది.
నిజము తెలీయదు కారణము బౌద్ధమత వ్రాతతో కూడిన పత్రాల్లో ఎక్కడా నాకు భగవద్గీత ప్రస్తావన లేదు.
బౌద్ధం వైదిక మతము నుంచి విడిపోయిన ఒక శాఖ.
పునర్జన్మ ని ఒప్పుకుంది.
చాతుర్వర్ణ ధర్మాన్ని ఒప్పుకుంది.
యఙ్ఞయాగాదులని, జంతుహింసనీ వ్యతిరేకించింది.
దానిదృష్ఠిలో యజుర్వేదము ఒక మతాచార గ్రంథము. వేదాలు, ఉపనిషత్తులు అధీకృత (authoritative) గ్రంథాలు అంటుంది. కాని బౌద్ధం త్రిపీటిక కూడా ఒక అధీకృత (authoritative) గ్రంథమే.
Authoritative in religious context means religious prescription of the process to be followed by the believers to achieve the religious goal (moksha).
ఇదమద్యమయాలబ్దమ్ఇమంప్రాప్స్యేమనోరథమ్ఇదమస్తీదమపిమేభవిష్యతిపునర్ధనమ్।। 16.13 ।।
అసౌమయాహతఃశత్రుఃహానిష్యేచాపరానపిఈశ్వరోహమహంభోగీసిద్ధోహంబలవాన్సుఖీ।। 16.14 ।।
ఆడ్యోభిజనవానస్మికోన్యోస్తిసదృశోమయాయక్ష్యేదాస్యామిమోదిష్యఇత్యజ్ఞానవిమోహితాః।। 16.15 ।।
13 -
ఇదం + అద్య + మయా + లబ్దమ్ +
ఇమం + ప్రాప్స్యే + మనః-రథమ్ +
ఇదం +అస్తి + ఇదం +అపి + మే +
భవిష్యతి + పునః + ధనమ్ +
14
అసౌ+మయా + హతః + శత్రుః +
హానిష్యే + చ + అపరాన్ + అపి +
ఈశ్వరః + అహం + భోగీ +
సిద్దః + అహం + బల-వాన్ + సుఖీ +
15
ఆడ్యః + అభిజన-వాన్ + అస్మి +
కః + అన్యః +అస్తి + సదృశః +
మయా + యక్ష్యే + దాస్యామి + మోదిష్యే +
ఇతి + అజ్ఞాన + విమోహితాః
వారి యఙ్ఞాలలో చేసే త్యాగాలకు అర్థం లేదు ఫలితము లేదు. యదార్థానికి వారు కోపము తో వ్యర్థ మైంది. చేయుట కొరకూ నామ కార్థము చేసే ఒక తంతు లేక చేశాననే ప్రచారానికి పనికి వస్తుంది. ఆ ప్రచారమువలన సంఘంలో గుర్తింపు పెరుగుతుంది. కానీ, కపట తత్వానికి అది పునాది. అది ఫలితాల నివ్వదు(ఆ కర్మలు సచేతన. కర్మలు). కోపము మొదలైన మానసిక వ్యధల వలని తోటి వారిని ద్వేషించి, పరమాత్మను మరచి పోతారు. ఆత్మ ద్వేషంతో తమకు వ్యతిరేకమై తమ పతనానికి తామే కర్తలుగా అసురులై శిక్ష పొందుతారు.
అహంకారంబలందర్పం
కామంక్రోధంచసంశ్రితాః
మామాత్మపరదేహేషు
ప్రద్విషంతోభ్యసూయకాః।। 16.18 ।।
తానహంద్విషతఃకౄరాన్
సంసారేషునరాధమాన్
క్షిపామ్యజస్రమశుభానా
సురీష్వేవయోనిషు।। 19 ।।
ఆసురీంయోనిమాపన్నా
మూఢాజన్మనిజన్మని
మామప్రాప్యైవకౌంతేయ
తతోయాంత్యధమాంగతిమ్।। 20 ।।
అహంకారము, బలము, గర్వము, కామము, మరియు కోపముచే ఆవరింపబడి పరమాత్మను (మామాత్మ) ఇతరలూ దేహమను ఉన్న పరమాత్మాoశను కూడా దుర్భ్షలాడే అసుర స్వభావము కలిగిన వారౌతారు.
కౄరులు, ద్వేషపూరిత (ద్విషతః)స్వభావము కలవారు, అధములు, నీచ నరులను (నరాధమాన్), నేను, భౌతిక జగత్తు, పదే పదే అటువంటి ఆసురీ స్వభావము కలవారి గర్భము(యోనిషు)లోనే విసిరివేస్తుంటాను (క్షిపామి).
ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ ఆసురీ గర్భము(యోనిషు)లలోనే జన్మిస్తుంటాయి. నన్ను చేరుకోలేక, ఓ అర్జునా, అత్యంత నీచ స్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి
తాన్ — ఇవి;
అహం — నేను
ద్విషతః — ద్వేషపూరితమైన
కౄరాన్ — కౄరమైన;
సంసారేషు — ఈ భౌతిక జగత్తులో;
నర-అధమాన్ — నరులలో నీచులు అధములు;
క్షిపామి — విసిరివేస్తాను;
అజస్రమ్ — పదే పదే;
అశుభాన్ — అశుభమైన;
ఆసురీషు — అసురీ ప్రవృత్తి కలవారు;
ఏవ — నిజముగా;
యోనిషు — గర్భములలోనికి;
ఆసురీం — ఆసురీ ప్రవృత్తికలవారు;
యోనిమ్ — గర్భములు;
ఆపన్నః — పొంది;
మూఢా — మూఢులు;
జన్మని జన్మని — జన్మజన్మలకు;
మాం — నన్ను;
అప్రాప్య — చేరుకోలేక;
ఏవ — కనీసం;
కౌంతేయ — అర్జునా,
కుంతీ పుత్రుడా;
తతః — ఆ తరువాత;
యాంతి — వెళ్ళెదరు;
అధమాం — హేయమైన;
గతిమ్ — గమ్యము.
పరమాత్మని నమ్మనివారు (బౌద్ధులు అందులోఉన్నారనచ్చు) అసురులు.
బౌద్ధులకు తక్కువ మాటల్లో చెప్పాలంటే, "దేవుడు లేడు". దైవ సంబంధమైన సృష్ఠి కర్త గా భగవంతుదు లేక పరమాత్మ బౌద్ధ ప్రవచనాల్లో కనపడదు. ఆందువల్లేనేమో, కొందరు, బౌద్ధం ఒక నాస్తిక మతమంటారు. బుద్ధుడు, చారిత్రకంగా, ఒక సామాన్య మానవుడుగా మొదలుపెట్టి, "మేల్కొలుపు" (enlightenment), క్రమశిక్షణ ( తో తన బుద్ధిని, మనసును నియంత్రిoచి "జ్ఞానోదయం" పొందాడు. తాను స్వయంశక్తితో తనలో దాగి ఉన్న శక్తుల సాయంతో "జ్ఞానోదయం" పొందటం బుద్ధుని చరిత్రలోని విశేషము. ఆ విషయఆన్ని దృష్ఠిలో పెట్టుకుని చూస్తే, బౌద్ధంలో దేవుని అవసరం లేదుకదా. ఏ తపస్సు లేకుండా, ఎదేవుడూ ప్రత్యక్షం కాకుండా మనిషి తనని తానే క్రమశిక్షణతో విముక్తి లేక మోక్షం పొందవచ్చు. కోరికలకు అంతం లేదు. మనసు ఓ భావోద్వేగాలముద్ద. మనసును నియంత్రిచకుందా కోరికలనుండి విముక్తిలేదు. కోరికలనుండి విముక్తిలేకుండా మనషికి విముక్తి రాదు."జ్ఞానోదయం" కలుగదు. ఇది బొద్ధానికి పునాది రాయి.