Bhagavadgita As Understood By Me - Part 10

(Chapter 12 Bhakti Yoga)

 

యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్ ।। 12.3 ।।

సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్దయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః ।। 12.4 ।।

 

ఎప్పుడూ నాశనం చెందనిదని అనిర్వచనమైన, అవ్యక్తమైన, విశ్వవ్యాపైన, వ్యామోహరహిత భావోద్వెగ రహిత, ఎల్లప్పుడూ ఒకేవిధంగాఉండగలిగి, శాశ్వతరూపైన మరియు నిశ్చలమైన వాడునూ - అయిన పరమ సత్యము యొక్క నిరాకార  తత్త్వాన్ని - ఇంద్రియముల నిగ్రహించి, సర్వత్రా సమబుద్ధి తో ఉంటూ, సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ - ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు.

 

వివరణ:

 

వసుధైక కుటుంబకం అంతే ఒక విధంగా నిర్వచనం ఈ శ్లోకం. "తే ప్రాప్నువంతి మామేవ" అంతే "మోక్షం" గా భావించవచ్చు.

 

"సర్వభూతహితే రతాః" - వసుధైక కుటుంబకం.

 

శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరమ్ ।। 12.12 ।।

 

అభ్యాసము కంటే ఙ్ఞానము ఉత్తమము. 

జ్ఞానము కంటే ధ్యానము ఉత్తమము.

ధ్యానము కంటే కర్మ ఫల త్యాగము మంచిది.

కర్మ ఫల త్యాగము చేసినవెంటనే శాంతి తక్షణమే దొరుకుతుంది.

 

అభ్యాసము అంటే యాంత్రిక కార్య నిర్వహణ.

 

అనంతరమ్ = తక్షణమే.

 

భారతీయ వేదాంతా ఆలోచనా ధోరణి ఇందులో ఉంది.

 

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ।। 12.13 ।।

సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనోబుద్ధిర్యో మధ్భక్తః స మే ప్రియాః ।। 12.14 ।। 

 

ద్వేషభావన లేకుండా సమస్త ప్రాణుల పట్ల మైత్రితో కారుణ్యముతో ఉంటారో, వారు, ఆస్తి పై మమకార రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు, సంతృప్తితో ఎల్లప్పుదూ యొగీ నియంత్రితాత్మతో ధృడ సంకల్పము నాకర్పించబడిన మనస్సు, బుద్ధి తో ఉన్న వారు నాకు చాలా ప్రియమైనవారు.

 

వివరణ:

 

ద్వేషభావన లేకుండా సమస్త ప్రాణుల పట్ల మైత్రితో కారుణ్యముతో ఉంటారో, వారు, ఆస్తి పై మమకార రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు, సంతృప్తితో ఎల్లప్పుదూ యొగీ నియంత్రితాత్మతో ధృడ సంకల్పము నాకర్పించబడిన మనస్సు, బుద్ధి కలిగి ఉండదము మానవతా వాదమే. 

 

యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియ: ।। 12.15 ।।

 

ఎవరి వలనా భావోద్వేగములనకు గురి కాకుండా ఉద్రేకపడకుండా, సుఖదుఖః భయ బాధలకు అతీతంగా ఉండే వారు నాకు ప్రియమైనవారు.

 

వివరణ:

 

"నాకు" అంటే "కృష్ణుకి" గా కంటే పరమాత్మాగా, అంటే అన్నిజీవాలలో ఉన్న  "ప్రాణం" గా తీసుకుంటే,, వసుధైకకుటుంబకం అంటే తెలుసుకోగలుగుతారు. ఏమీ తెలియకుండా, తెసుకోకుండా యాంత్రికంగా ఆరాధన "భక్తి" కాదు. భక్తిలో తెలిసిన అంకిత భావం ఉంది.

 

"వసుధైకకుటుంబకం" అనే భావంలో అహంకారం అత్మసమర్పణం చేసుకుంటుంది అంటే అహంకారనికి అస్తిత్వం లేదు. అహంకారం, జీవంలేదు ఓ కలిసిన కవలలు. వాళ్ళని శస్త్ర చికిత్స ద్వారా విడగొట్టి దురహంకారన్ని (తన చుట్టూ తిరిగే విధానం) వదిలివెయ్యడం అత్మసమర్పణం.

 

అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః ।। 12.16 ।।

 

ఏమీఆశించక, శుభ్రత, దక్షత గతంకలిగించే బాధల వలన కలతచెందకుండా అన్ని వ్యవహారములలో స్వార్ధచింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. 

 

వివరణ:

 

గుర్తింపుకోసం వెంపరలాడకుండా ఏమీఆశించక, శుభ్రత, దక్షత గతంకలిగించే బాధల వలన కలతచెందకుండా అన్ని వ్యవహారములలో స్వార్ధచింతన లేకుండా వ్యవహరించేవారు సర్వప్రాణ సద్భావన ఉన్నట్లేకదా..అదేకదా "వసుధైకకుటుంబకం".

 

 

యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః ।। 12.17 ।।

 

ఎవరైతే ఆనందం-నిరాశలకు దూరంగా ఉండి, కోరికల ఫలిత శుభా-అశుభాలను త్యజించుతారో. అటువంటి జనులు, భక్తితో నిండి ఉన్న వారు నాకు చాలా ప్రియమైనవారు.

 

వివరణ:

 

ఎవరైతే ఆనందం-నిరాశలకు దూరంగా ఉండి, కోరికల ఫలిత శుభా-అశుభాలను త్యజించుతారో. అటువంటి జనులు వారు సామాజిక స్పృహతో స్వార్ధంలేని మనుషులు. మనిషిని, జంతువునూ విడదీసే హేతుబద్ధఙ్ఞానం, బుద్ధి మానవ కల్యాణానికి వినియోగించాలి. దానికొరకు, సంఘసభ్యులందరూ కలసి ముందుకు ఒకే ఒక దీక్షతో సామాజిక స్పృహతో స్వార్ధంలేని మనుషులుగా జీవించాలి. మనమందరమూ "వేఱొకటి లేని ఎవరికివారై" న మనము ఒకరిమీద ఒకరు ఆధారపడిన మనుషులం. మనమందరమూ మన వ్యఖ్యనలతో, కారణాలతో, స్వార్ధాలతో, సంకుచితతత్వాలతో కొరికలతో అహంకారాలతో ఒకదానిపైఒకటిగా సమస్యలను కల్పించుకుంతూ ఎదతెగని ప్రయణాంలో ఇరుక్కుని వున్నాము. కాని, విముక్తి వ్యక్తిగతమైనా సామాజిక స్పృహతోనే అది సాధ్యం.  

 

సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః ।। 12.18 ।।

తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరః ।। 12.19 ।।

 

తాత్పర్యం & వివరణ 

 

ఎవరైతే, మిత్రులపట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము-అపమానముల ఎడ, చలి-వేడిమి పట్ల, సుఖ-దుఖః ముల పట్ల సమబుద్ధితో ఉంటారో, మరియు చెడు సాంగత్యము ను విడిచి ఉంటారో; దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో, మౌనముగా చింతన చేస్తుంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాసస్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా నా యందే లగ్నమై ఉన్నదో, ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో, (అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైనవారు) వారు సంఘమిత్రులు నిర్మాతలు.