BhagavadGitaAsUnderstoodByMe Part - 16

17. శ్రద్ధా త్రయ విభాగ యోగము

Srinivas Maddali

 

సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యచ్చ్రద్ధః స ఏవ సః ।। 17.3 ।।

సత్వ గుణం ఒక వ్యక్తి స్వభావమును తెలుపుతుంది. ఆ వ్యక్తి ప్రణాంశ ఒక విశ్వాసానికి  కట్టుబడి ఉంటాడు. అందువలన, అతడు  సాత్వికస్వాభావి గానే ఉంటాడు.

 

యజంతే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః ।।17.4 ।।

సత్వ గుణమున్నవారు దేవతలను, రజోగుణములో ఉండేవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు, తమో గుణములో ఉండేవారు భూత ప్రేతములను ఆరాధిస్తారు.

 

అశాస్త్రవిహితం ఘోరంతప్యంతే యే తపో జనాః దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః  ।।17.5 ।।

కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్  ।।17.6 ।।

శాస్త్ర విరుద్ధంగా ఆచరిస్తూ ఘోరమైన కామము,  మమకారముచే ప్రేరితులై, వారు తమ శరీర అవయములనే కాక, వారి శరీరములోనే ప్రాణంశను కష్ట పెడతారు.వారు నిశ్చయముగా అసుర (న+సుర) గుణసంకల్పంతో ఉన్నవారని తెలుసుకోవాలి.

 

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః.యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శ్రృణు ৷৷17.7৷৷

వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది. యజ్ఞములు, తపస్సు, మరియు దానములు కూడా వారియొక్క ప్రవృత్తి బట్టి ఉంటాయి. ఇప్పుడిక ఈ బేధముల గురించి వినుము.

 

ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాఃరస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ৷৷17.8৷৷

సత్త్వ గుణవంతులు ఆయుష్షుని పెంచేవి, బలమును, ఆరోగ్యమును, సుఖమును, మరియు తృప్తిని పెంచేవాటిని ఇష్టపడుతారు.

 

కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః.ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః ৷৷17.9৷৷

చేదుగా, పుల్లగా, ఉప్పగా, వేడిగా, ఘాటుగా, ఎండి పోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్ధములు రజో గుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారములు బాధను, శోకమును మరియు వ్యాధులను కలుగ చేస్తాయి.

 

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్.ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ৷৷17.10৷৷

ఎండిపోయిన ఆహారము, రుచిలేని, మురిగిపోయిన, కలుషితమైన , అపరిశుద్ధ, వదిలివేయబడిన ,  అపరిశుద్దమైన, ఆహారము,తామసీ గుణము న్న వారికి, ఇష్టమైనవి.

 

అఫలాకాఙ్క్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే.యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః ৷৷17.11৷|

ప్రతిఫలము ఏమీ ఆకాంక్షిచకుండా, యజ్ఞము,  వైదిక శాస్త్రములు ఉపదేశించిన విధముగా, ఏదైతే, చేయుదురో,  కర్తవ్యముగా చేయవలసినదే నని, మనస్సు, ధృడ సంకల్పముతో,  అది, సాత్విక స్వభావము తో చేసినట్టు.

 

అభిసంధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్.ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ৷৷17.12৷৷

ప్రేరేపింపబడి కాని ఫలితము దంభము కోసము కూడా నిజముగా ఏదైతే చేయబడునో అర్జునా, భరతులలో శ్రేష్ఠుడా, అది యజ్ఞమని రజో గుణములో ఉన్నది అని తెలుసుకొనుము.

 

విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్.శ్రద్ధావిరహితం యజ్ఞంతామసం పరిచక్షతే ৷৷17.13৷৷

శాస్త్ర ఉపదేశములను కాదని,  ప్రసాద వితరణ లేకుండా,  వేద మంత్రములు జపించ కుండా, పురోహితులకు దక్షిణ ఇవ్వకుండా, శ్రద్ధ లేకుండా చేసిన యజ్ఞము తమోగుణములో ఉన్నది పరిగణించబడును.  

 

దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్.బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ৷৷17.14৷৷

దేవతలు, బ్రాహ్మణులు, గురువులు, పెద్దలు, పూజ చేయుట, శౌచము (cleanliness) , సరళత (simplicity), బ్రహ్మ చర్యము (celibacy) , అహింస శారీరిక తపస్సు (meditation) అని చెప్ప బడును. 

 

అనుద్వేగ కరం వాక్యం సత్యం ప్రియ హితం చయత్స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ৷৷17.15৷৷

భావోద్వేగకర (emotional) మాటలు, సత్యములు, లాభ కారి, మరియు, ఏదైతే వేద శాస్త్రముల అధ్యయనం ద్వారా , మరియు ఇంకా, వాక్కుతో నిండిన (వాఙ్మయం), తపస్సు (meditation)  అని పేర్కొన బడును.

 

మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః.భావ సంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే ৷৷17.16৷৷

మనస్సులో ప్రశాంతత, సౌమ్యత్వం, మౌనము, ఆత్మనిగ్రహం, భావములో పవిత్రత - ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పేర్కొన బడినాయి.

 

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే ।। 17.17 ।।

శ్రద్ధతో అలౌకికమైన చేయ బడిన తపస్సు వ్యక్తుల చే భౌతిక ఫలాపేక్ష లేకుండా,  అచంచలమైన సత్త్వ గుణములో ఉన్నట్టు పరిగణించబడును.

 

సత్కారమానపూజార్థంతపో దమ్భేన చైవ యత్క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చల మధ్రువమ్ ৷৷ 17.18 ৷৷

కీర్తిప్రతిష్టలు, గౌరవము, ఆరాధన, కోసము, తపస్సు దంభముతో (కపటత్వము, బడాయి)  కూడా నిజముగా ఏదయితే చేయ బడునో అది ఇహ లోకములో చెప్పబడినది. అవి రజో గుణములో ఉన్న అస్థిరమైన తాత్కాలికమైన వి.(తత్+కాల=అప్పటి కాలము). 

 

మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః.పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ ৷৷17.19৷৷

అయోమయ భావాలతో ఉన్నవారు శ్రమతో కూడి తమకు తామే బాధపెట్టుకొని ఇతరులకు  హాని చేయటానికి చేయు తపస్సు తమో గుణము ప్రధానమని పేర్కొనబడినది.

 

దాతవ్యమితి యద్దానం దయతేనుపకారిణే.దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ৷৷17.20৷৷

దానము కర్తవ్యమని భావించి ప్రతి ఫలాపేక్ష లేకుండా, తగిన వారిని గుర్తించి సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్త్వగుణ దానము అని చెప్పబడుతుంది.

 

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునఃదీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ৷৷17.21৷৷

ఏ దయితే ప్రత్యుపకారాన్ని అసించి దానం చేస్తారో లేదా,అయిష్టముగా దానము చేస్తారో అది రజో గుణముతో చేయ బడినట్లు చెప్ప బడినది.

 

అదేశకాలే యద్దానంఅపాత్రేభ్యశ్చ దీయతేఅసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ৷৷17.22৷৷

తప్పు ప్రదేశంలో,  తప్పు సమయంలో, అర్హత లేనివారికి, చేసిన దానము తామస గుణముతో చేసిన దానము గా పరిగణించ బడుతుంది.

 

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునఃదీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ৷৷17.21৷৷

ఏ దయితే ప్రత్యుపకారాన్ని అసించి దానం చేస్తారో లేదా అయిష్టముగా దానము చేస్తారో అది రజో గుణముతో చేయబడినట్లు చెప్పబడినది.

 

అదేశకాలే యద్దానంఅపాత్రేభ్యశ్చ దీయతేఅసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ৷৷17.22৷৷

 

తప్పు ప్రదేశంలో తప్పు సమయంలోఅర్హత లేనివారికిచసిన దానము తామసగుణముతో చేసినదానము గా పరిగణించబడుతుంది.

 

ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధః స్మృతః.బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా৷৷17.23৷৷

తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః.ప్రవర్తన్తే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ ৷৷17.24৷৷

 

17.23 శ్లొకములో ఓం తత్ సత్ — సర్వోత్కృష్ట అలౌకికమును సూచించే పదములు ఉపయోగించటము గుర్తించాలి.

సర్వోత్కృష్ట అలౌకికమును సూచించే పదములు ఓం తత్ సత్. వాటినుండి బ్రాహ్మణులు (శాస్త్రఙ్ఞులు) , వారి నుండి శాస్త్రములు, వాటినుండి యఙ్ఞములు (కర్మకాండలు) పుట్టినవి అని చెబుతారు. యఙ్ఞములు చేయటములో, దానమివ్వటంలో, తపస్సు చేయడంలో వేద నియమముల ప్రకారం ఎల్లప్పుడూ ఓం తో ప్రభించిన వేదముల మంత్రములను పఠించెదరు.

 

తదిత్యనభిసన్ధాయ ఫలం యజ్ఞతపఃక్రియాఃదానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాంక్షిభిః ৷৷17.25৷৷

 

సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే ।। 17.26 ।।

యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ।। 17.27 ।।

 

వేదముల నిర్దేసించిన ప్రకారము యఙ్ఞములు, కాఠిన్యముతో చేసిన తపస్సు, ప్రతి ఫలాపేక్షలేని దానములు చేసేముందు ఉచ్చరించే "తత్" శబ్దం పరమాత్మను సూచిస్తూ  మోక్షమును కలిగిస్తుంది.

భగవంతుని శహః , వహః, కహః, కిం, యత్, తత్, పదం, అనుత్తమం మొదలైన పదాలతో పిలుస్తారు  (మహ భారతం 13 (అనుశాసన పర్వము).254  (ఆశ్వాసము).91 (శ్లోకం)).

 

In Gayatri Mantra also you find the word “tat”.

అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్.అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ৷৷17.28৷৷

అశ్రధ్ధతో యజ్ఞము,దానము, మరియు తపస్సు చేసి,  ఏదైతే అసత్ (సత్ ఎల్లప్పుడూ నశ్వరం అసత్ ఎల్లప్పుడూ నశిస్తుంది) ఈ విధముగా అని చెప్పబడును, ప్రిథ పుత్రుడా పార్థా,.......

విష్ణు శర్మ వ్రాసిన "పంచతంత్ర" లో ఓ కథ "త్యాగం" గూర్చి. ఒక వేటగాడు తన అతిథి కొరకై ఆహారంగా ఓ పావురాన్ని వేటాడి, వండటానికై నిప్పు చేస్తాడు. తన భర్త పావురం చని పోయిందని, వేటగాడు వంట కై చేసిన మంటలో పడి ఆత్మత్యాగం చేస్తుంది.

ఆ త్యాగం ఉత్తమం.