Bhagavadgita As understood by me - part 3 (sankhya yoga, karma yoga)
క్రీ.శ 4 శతబ్దం లో సంఖ్య యోగన్ని "సాంఖ్య ఆరిక" లో విశదీకరించారు. సాంఖ్యాలోచనలో "సాంఖ్య ఖరిక" చాలా ప్రాధాన్యం ఉన్న పుస్తకం. ఈ పుస్తకంలో వేదాలని ప్రధాన స్మృతులుగా గుర్తించరు. ఈ యొగం లోతైన స్వతంత్ర అంతర్గత అనుభవపూర్వకమైన ప్రతిబింబైక విచారణత్మకం. పతంజలి యొగ శాస్త్రం (ఈ ఆధునిక యుగంలో) సాంఖ్య యోగాన్ని లోతైన అవగాహనతో సాధనచేస్తారు.
సాంఖ్య-యోగ సాధకులకు మేధో విశ్లేషణాత్మక స్థాయిలో ఆత్మ మరియు విషయం గురుంచి తెలుసు కుంటారు. ఆ మార్గం కనిపించే ప్రపంచమును ఆధ్యాత్మిక అధ్యయనం వైపు మళ్ళించటానికి ప్రయోగాలు, లోతైన తాత్విక ఆలోచనలు చేస్తుంటారు.
ఈ శాస్త్రీయ అవగాహనతో, ఈ భాగంలో, భగవద్గీత అర్థం చేసుకోవడానికి, చర్చించడానికి ప్రయత్నం చేద్దాం.
జ్ఞేయఃసనిత్యసంన్యాసీయోనద్వేష్టినకాఙ్క్షతి. నిర్ద్వన్ద్వోహిమహాబాహోసుఖంబన్ధాత్ప్రముచ్యతే৷৷5.3৷৷
ఎవరౌతే ద్వేష, క్రోధలకు దోరమౌతరో, ఎవరికైతే సాంఖ్య లలో తృష్ణ లేకుండా ఉంటారో, వారు కర్మ పరిత్యాగానికి ముందే పరిత్యాగులౌతారు (those who renunciate) .
కర్మ సన్యాస యోగం (పరిత్యాగ కర్మ యోగం)- రెండు మార్గాలను సూచిస్తుంది. కర్మ యోగం, కర్మ సన్యాస యోగం.
కర్మ యోగం - ఫలాపేక్షలేకుండా నిర్వహించడం.
కర్మ సన్యాస యోగం - కర్మలను భక్తితో నిర్వహించడం .
నిజమైన భక్తి ఫలా పేక్ష లేనిది. అది ఆధ్యాత్మికతతో వ్యక్తి నిర్వహించవలసిన విధులు, బమ్మెర పోతన, భక్త తుకారాంలా నిర్వహించడం. ఆధునిక యుగంలో, ఫలాపేక్షలేని భక్తి లేదుకదా, అని అంటే పొలాల్లో పనిచేసే వారు, రిక్షాలు తొక్కే వారు, అంబానీలు తెలీని, అలా కావాలని కోరుకోకుండా తన సంఘంలో తన పాత్రని పోషిస్తూ, సంఘములోని ఇతరులను అర్థం చేసుకొంటూ, సంఘాన్ని కాపాడుకుంటూ, తిరుపతిలో వెంకన్న దర్శనాన్ని ఏ కొరికాలేకుండా నిశ్చల మనస్సు తో ఏ విచారంలేని, పగలంతా శ్రమపడి, రాత్రి జంకుల కధలు వింటూ సోమ (నీరా లేక కల్లు)పానం చేసి వళ్ళు తెలీకుండా నిద్దర పోయి మరుసటిరోజు నిన్నటిని తలుచుకోకుండా నేటిలో బ్రతికే అమాయకులు,
అలా ముందుకు పోయేవాళ్ళు ఫలా పేక్షలేకుండా భక్తితో తమ కర్మలను నిర్వహించే వాళ్ళే. వారే కర్మ సన్యాస యోగులు. జీవన భృతి సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం భాద్యత. ఫలాపేక్ష ఉన్న కర్మలు కావు. సామాన్యుడు సంపాదించే 100 రూపాయలు దేవుడి హుండ్లో వేస్తే అది వాని రోజు వారి సంపాదనలో అది 20% కంటే ఎక్కువే. ఓ ధనవంతుదు కోటి రుపాయలు దెవుడి హుండీలో వేస్తే, అది రోజు వారీ సంపాదనలో 10% కంటే తక్కువ వుంటుంది. ఆయన తన సంపదనలో కొంత ఫలాపేక్ష లేకుండా ఉంటుంది. ఈయన దేవునితో వ్యాపారం చేస్తాడు లేదా నల్ల డబ్బు వదిలించుకుంటాడు.
జీవన భృతి సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం భాద్యత. ఫలాపేక్ష ఉన్న కర్మలు కావు. సామన్యుడు సంపాదించే 100 రూపాయలు దేవుడి హుండ్లో వేస్తే అది వాని రోజు వారి సంపాదనలో అది 20% కంటే ఎక్కువే. ఓ ధనవంతుదు కోటి రుపాయలు దెవుడి హుండీలో వేస్తే, అది రోజు వారీ సంపాదనలో 10% కంటే తక్కువ వుంటుంది. ఆయన తన సంపదనలో కొంత ఫలాపేక్ష లేకుండా ఉంటుంది. ఈయన దేవునితో వ్యాపారం చేస్తాడు లేదా నల్ల డబ్బు వదిలించుకుంటాడు.
జనకుడు కర్మ సన్యాస యోగి. ఆయన రాసిన గీత కర్మ సన్యాస యోగాన్ని విపులంగా వివరిస్తుంది. జనకుడి కర్మ సన్యాస యోగం మీద, ఓ కథ ప్రచారం లో వుంది.
జనకుడి భార్య జనకుడితో "మీరు సంసారం చేస్తూ కర్మ సన్యాస యోగిని అని ఎట్లా చేప్ప గలరు?" అంది. ఆయన సమాధానం వెంటనేఇవ్వలేదు. కొన్నాళ్ళతరువాత, ఓ విందు లో జనకుడి భార్య కూడా పాల్గొంది. ఆమెకు జనకుడు, సేవకుడిని పిలిచి తన భార్య తో, "పైకిచూడమని" చెప్పమన్నడు. ఆమె పైకి చూస్తె కత్తి ఓ వెంట్రుక లాంటి దారంతో కట్టి ఉంది. వ్రేలాడతీసిన కత్తి చూసి భయంగా విందు ఎప్పుడౌతుందాఅని ఎదురుచుస్తూ వుంది. విందు పూర్తి అయిపోగానే శ్వాస విస్రాతిగా . ఆ సాయంత్రం జనకుడు, ఆమె ఏకాంతంలో ఉండగా, జనకుడు ఆమెతో విందులో ఫలానా వంటకం చాలాబాగంది కదా అంటే ఆమె, "నాకు భయం తప్ప విందు రుచులు ఏమి తెలియవు" అంది.
జనకుడు "అదే కర్మ సన్యాస యోగం. భయంతో రుచి తెలియకుండా అన్నం తిన్నావు. అలాగే భయం తో కాకుండా నీ అంతట నువ్వే చెయ్యి, రుచులకు బానిస కాకుండా తిను అదే సన్యాస యోగం" అన్నాడుట.
యోగయుక్తోవిశుద్ధాత్మావిజితాత్మాజితేన్ద్రియః. సర్వభూతాత్మభూతాత్మాకుర్వన్నపినలిప్యతే৷৷5.7৷৷
నిష్కామ కర్మాచారణం, నిర్మల హృదయం, మనోజయం, ఇంద్రియ నిగ్రహం తో సమస్త జీవులలో ఆత్మ ఒక్కటే అనేవారు చేసే కర్మలు నిర్వహించడం వలన ఏ దొషము అంటదు.
నైవకించిత్కరోమీతియుక్తోమన్యేతతత్త్వవిత్. పశ్యన్శ్రృణవన్స్పృశఞ్జిఘ్రన్నశ్నన్గచ్ఛన్స్వపన్శ్వసన్৷৷5.8৷৷
ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి. ఇన్ద్రియాణీన్ద్రియార్థేషువర్తన్తఇతిధారయన్৷৷5.9৷৷
బ్రహ్మణ్యాధాయకర్మాణిసఙ్గంత్యక్త్వాకరోతియః. లిప్యతేనసపాపేనపద్మపత్రమివామ్భసా৷৷5.10৷৷
సత్యం తెలిసినవారు మనోనిగ్రహంతో, అంతర్ముఖులై, జ్ఞానేంద్రియలను లనుతన వశంలో ఉంచుకుని , కర్మేంద్రియలు తమ తమ విధినిర్వహణలో, అట్లాగే ప్రాణ
వాయువులు (ప్రాణ, సమన, వయాన, ఉదాన, అపాన) తమ తమ విధులు నిర్వహిస్తుంటే, వ్యక్తి 'తనేమీ చేయటంలేదనీ అంతర్ముఖుడై 'నా శరిర ధర్మం ఒకటే నని, అది "జివ" ధర్మం అనీ అది ఙ్ఞాననేంద్రియాలు, కర్మేంద్రియాలు "జివి" సాంగత్యంలో కళంకం లేని కర్మ యోగమో లేక కర్మ సన్యాస యోగం ప్రాకృతమేగాని, కళంకిత కర్మకాదు. (Tainted action with some desire).
కామక్రోధవియుక్తానాంయతీనాంయతచేతసామ్. అభితోబ్రహ్మనిర్వాణంవర్తతేవిదితాత్మనామ్৷৷5.26৷৷
కోరికల విముక్తి పొంది తమ బుధ్దిని, భావోద్వేగాలను నియంత్రించగలుగుతారో వారు పరబ్రహ్మ (మూలాధార శక్తి) కు దగ్గరౌతారు.
స్పర్శాన్కృత్వాబహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాన్తరేభ్రువోః. ప్రాణాపానౌసమౌకృత్వానాసాభ్యన్తరచారిణౌ৷৷5.27৷৷
యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః. విగతేచ్ఛాభయక్రోధోయఃసదాముక్తఏవసః৷৷5.28৷৷
తమ ఙ్ఞానేంద్రియాలను నియంత్రించి బహిర్ప్రపంచానికి సంబంధాలను తమశక్తితో తన్మాత్రంగా త్రుంచి అంతర్ముఖంగా దృష్ఠిని నిలిపి కోరిక, భయం, కోపం లేకుండా తన ధర్మాలను నెరవేరుస్తారో వారు కోరికతో ముడిపడని కర్మయోగులు.
తమ ఙ్ఞానేంద్రియాలను నియంత్రించి బహిర్ప్రపంచానికి సంబంధాలను తమశక్తితో తన్మాత్రంగా త్రుంచి అంతర్ముఖంగా దృష్ఠిని నిలిపి కోరిక, భయం, కోపం లేకుండా తన ధర్మాలను నెరవేరుస్తారో వారు కోరికతో ముడిపడని కర్మయోగులు. వారిది సరైన ధ్యానం ఔతుంది. కోరికతో ముడిపడిన ధ్యానం విముక్తికి మార్గంకాదు.
భోక్తారంయజ్ఞతపసాంసర్వలోకమహేశ్వరమ్సుహృదంసర్వభూతానాంజ్ఞాత్వామాంశాన్తిమృచ్ఛతి৷৷5.29৷৷
బహిర్గత ప్రపంచ మూలాధార శక్తే అంతిమ భోక్తగా (beneficiary) శ్రధ్దాపూర్వక శాస్త్రోక్త యజ్ఞ (కర్మ) తపసాదుల నిర్వహించే వారు శాంతిని పొందుతారు.