BhagavadGitaAsUnderstoodByMe Part-17
(18వ అధ్యాయము: మోక్ష సన్యాస యోగము)
Srinivas Maddali
కామ్యానాంకర్మణాంన్యాసం సంన్యాసంకవయోవిదుఃసర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగంవిచక్షణాః৷৷18.2৷৷
సచేతన కర్మల త్యాగమే సన్యాసము. సర్వకర్మఫలత్యాగం పండితులు "త్యాగము" అని అన్నారు.
సత్ + న్యాసము = సన్యాసము. న్యాసము అంతే శుద్ధి చేయటం. వైదిక, తాంత్రిక విధానాల్లో న్యాసం ఒక ఆచరణాత్మక విధిగా (4 విధాలు) చెపుతారు. అవి
1. ఋషి న్యాసం,
2. కర న్యాసం,
3. మాంత్రిక న్యాసం,
4. మహాశోడస న్యాసం.
వీటిని రావణా బ్రహ్మ సూత్రికరించాడు. సంధ్యా వందనంలో కుడ న్యాసము ఒక భాగము. బీజాక్షరాలు చదువుతూ శరీర భాగల్ని తాకుతూ శుభ్రం చేసుకోవటం ఆ కర్మకాండ ఫలితం.
Ravanudu brahmana. Ravana was born to the great sage Vishrava, and his wife, the Rakshasa princess Kaikesi in the Treta Yuga. People of Bisrakh village in Uttar Pradesh claim that Bisrakh was named after Vishrava, and that Ravana was born there. But according to Hela historical sources and folklore, Ravana was born in Lanka, where he later became king. Vishravas, is the son of Pulastya, and a powerful rishi (sage), as described in the Hindu epic Ramayana. A scholar par excellence, he earned great powers through the performance of tapasya, which in turn, earned him great name and fame amongst his fellow rishis. He is best known for being the father of the primary antagonist of the Ramayana, Ravana.
న్యాస అంటే వదిలి వేయడం.
న్యాస అనే పదం ఒక తెగది కూడ. వీరు ఆఫ్రికా ఖండం లో ఆగ్నేయం భాగంలో నివసించారు. ఇప్పటికి కొ0దరు ఉన్నరు టాంజినీయా, మలావీ దేశాల్లో
న్యాస అంటే వదిలి వేయడం.
శ్రీమద్ భాగవతం (2.3.1) లో
నిద్రాయ హృయతే నక్తం
వ్యవాయెన చ వా వయః
దివా చార్తేహయా రాజన్
కుటుంబ-భరనేన వ
निद्रया ह्रियते नक्तं
व्यवायेन च वा वय:
दिवा चार्थेहया राजन्
कुटुम्बभरणेन वा||
అసూయా పరుడైన ఓ గృహస్తుడు తన రాత్రిని శృంగారం లో గాని, సుఖ నిద్ర్ లో గాని గడుపుతాడు. అతడు పగ్టి సమయం డబ్బు సంపదనలో గదుపుతాదు. అది భౌతిక (మెటేరీలిస్టిక్) జీవితం.
నియతస్యతుసన్న్యాసఃకర్మణోనోపపద్యతేమోహాత్తస్యపరిత్యాగస్తామసఃపరికీర్తితః।। 18.7 ।।
తు = కానీ
నియతస్య = విధింపబడిన కర్తవ్యముల యొక్క
సన్న్యాసః = సన్యాసము
కర్మణః = కర్మలు
న ఉపపద్యతే = చేయకూడదు.
అస్య = దానికి
మోహాత్ = మోహవశులై
పరిత్యాగః = త్యాగము
తామసః = తామసీ
పరికీర్తితః = అని చెప్పబడినది.
కర్మలను వదలివేయుట ఏ వాదన కూ నిలబడదు. కర్మలను త్యజించుట అఙ్ఞానము. కర్మలనిటిని వదిలివేయుత నిజముకాని మాయా వాదము అని తమససిక నిర్ణయము అని అని చెప్పబడినది.
దుఃఖమిత్యేవయత్కర్మకాయక్లేశభయాత్యజేత్సకృత్వారాజసంత్యాగంనైవత్యాగఫలంలభేత్।। 18.8 ।।
దుఃఖం+ ఇతి + ఏవ = కష్ట దాయక మైనది ఈ విధముగా నిజముగా
యత్ + కర్మ = ఏదయితే కర్మలు
కాయ + క్లేశ + భయాత్ = శారీరిక అసౌకర్యము భయముతో
త్యజేత్ + సః + కృత్వా = త్యజించుట వారు చేయటం వల్ల
రాజసం = రజో గుణములో
త్యాగం = కర్మ ఫలములను భోగించాలనే కోరికను త్యజించటం
న + ఏవ = నైవ = కాదు నిజముగా
త్యాగఫలం = త్యాగఫలము (అనగా కర్మఫలత్యాగము)
లభేత్ = పొందుట
తన భాద్యతలతో ముడిపడి ఉన్న కర్మలు కష్టం మని, ఆ కర్మలను శారిరక అసౌకర్మయము కలిగిస్తున్నాయని, లేక వాటిని త్యజించటం, రజో గుణ త్యాగము అంటారు. దానిని కర్మఫలత్యాగమని అనరు, అనరాదు అది ఉన్నతికి దోహదపడదు.
కార్యమిత్యేవయత్కర్మనియతంక్రియతేర్జునసంగంత్యక్త్వాఫలంచైవసత్యాగఃసాత్త్వికోమతః।। 18.9 ।।
కార్యం + ఇతి + ఏవ = కర్తవ్యముగా అలా నిజముగా
యత్ + కర్మ నియతం = ఏదయితే చేయ వలసిన (ధర్మ విహిత) కర్మలు(గా)
సంగం + త్యక్త్వా = కోరికతో కూడిన ఆసక్తి త్యజించి
క్రియతే + అర్జున = చేయబడునో అర్జునా
ఫలం + చ + ఏవ + సః + త్యాగః = ప్రతి ఫలము మరియు నిజముగా అటువంటి కర్మ (ధర్మ విహిత కర్మలు) ఫలములను భోగించాలనే వాంఛను విడిచిపెట్టుట.
సాత్త్వికః + మతః = సత్త్వ గుణము లో ఉన్నది.
కర్తవ్య ధర్మమునకు అను గుణము గా ఎప్పుడైతే కర్మలు చేయ బడుతాయో, అర్జునా, మరియు ఫలా పేక్ష త్యజించ బడుతుందో (త్యాగము చేయ బడుతుందో) దానిని సత్త్వ గుణ త్యాగము అంటారు.
నద్వేష్ట్యకుశలంకర్మకుశలేనానుషజ్జతేత్యాగీసత్త్వసమావిష్టోమేధావీఛిన్నసంశయః৷৷18.10৷৷
న + ద్వేష్టీ + అకుశలం = ద్వేషము కాదు నచ్చని పనులు
కుశలే = ఇష్టమైనవి
న + అనుషజ్జతే = ఆశించ కుండా ఉంటాడో
త్యాగీ = వాంఛను విడిచిపెట్టినవాడు
సత్త్వ = సత్త్వ గుణము యందు
సమావిష్టః = సంపన్నుడైన
మేధావీ = తెలివికలవాడు
ఛిన్నసంశయః = సంశయములు లేని వారు
శరీరమునకు కష్ఠము కలిగించే కర్మలను ద్వేషించని వారు, శరీరమునకు ఇష్టమైన కర్మల యందు ఆసక్తి లేని వారు, సత్త్వ గుణ సంపన్నులు, తెలివి కలవారు, సంశయములు లేని వారు.
నహిదేహభృతాశక్యంత్యక్తుంకర్మాణ్యశేషతఃయస్తుకర్మఫలత్యాగీసత్యాగీత్యభిధీయతే৷৷18.11৷৷
న + హి + దేహభృతా + శక్యం = శరీర ధారులకు నిజముగా సాధ్యము కాదు
త్యక్తుం + కర్మాణి + అశేషతః = కర్మలు సంపూర్ణముగా త్యజించుట
యః + తు + కర్మఫల + త్యాగీ = ఎవరైతే కానీ కర్మఫలములను త్యగముచేస్తారో
కర్మలు సంపూర్ణముగా త్యజించుట శరీర ధారులకు నిజముగా సాధ్యము కాదు. ఎవరైతే కర్మఫలములను త్యాగము చేస్తారో వారే నిజమైన త్యాగి అని చెప్పబడతారు.
అనిష్టమిష్టంమిశ్రంచత్రివిధంకర్మణఃఫలమ్భవత్యత్యాగినాంప్రేత్యనతుసంన్యాసినాంక్వచిత్৷৷18.12৷৷
అనిష్టం = అయుష్టములు
ఇష్టం = ఇష్టమైనవి
మిశ్రం = ఈ రెండూ మిశ్రమమైనవి
చ = మరియు
త్రివిధం = మూడు విధములైన
కర్మణః ఫలం = కర్మఫలములు
భవతి = ఉండును
అత్యాగినాం = వ్యక్తిగత ప్రతిఫలము పట్ల ఆకర్షితమయ్యేవారు
ప్రేత్య = మరణించిన పిదప
న = కాదు
తు = కానీ
సన్యాసినాం = కర్మలను త్యజించినవారు
క్వచిత్ = ఎప్పటికీ.
అయుష్టమైనవి, ఇష్టమైనవి, ఆ రెండు కలసిన మిశ్రం గా మూడు విధములైన కర్మలూ ఫలాలను ఇస్తాయి. కానీ, ఆ కర్మలను త్యజించిన వారు ఎప్పటికీ (మరణించిన పిదప కూడ) కర్మఫలాలను పొందడు.
పఞ్చైతాని మహాబాహో
కారణాని నిబోధ మే
సాంఖ్యే కృతాన్తే ప్రోక్తాని
సిద్ధయే సర్వకర్మణామ్ ৷৷18.13৷৷
పంచ = ఐదు
ఏతాని = ఇవి
మహాబాహో = గొప్ప బాహువులు కలవాడా (అర్జునా)
కారణాని = కారణములు
నిబోధ = వినుము
మే = నా నుండి
సాంఖ్యే = సాంఖ్య శాస్త్రము యొక్క
కృత + అంతే = కర్మల ప్రతిచర్యాంతము
ప్రోక్తాని = వివరించును
సిద్దయే = సాధించుటకు
సర్వ = సమస్త
కర్మణామ్ = కర్మల యొక్క
సాంఖ్య శాస్త్రము ప్రతి కార్యము వెనుక ఐదు కారకములను గుర్తిస్తుంది. అది కర్మ ప్రతిచర్యలను ఎలా నిరోధించాలో వివరిస్తుంది.
అధిష్ఠానంతథాకర్తాకరణంచపృథగ్విధమ్వివిధాశ్చపృథక్చేష్టాదైవంచైవాత్రపఞ్చమమ్৷৷18.14৷৷
అధిష్ఠానం = దేహము
తథా = మరియు
కర్తా = చేసెడివాడు (ఆత్మ)
కరణం = ఇంద్రియములు
చ = మరియు
పృథక్ + విధం = వేర్వేరురకాల
వివిధాః + చాలా
చ = మరియు
పృథక్ = భిన్నమైన
చేష్టా = ప్రయత్నములు
దైవం = దైవానుగ్రహము
చ + ఏవ + అత్ర — ఇవిఖచ్చితముగా (కారణములు)
పంచమమ్ = ఐదు
సాంఖ్యవాదులు
1. శరీరము
2. కర్త
3. పంచేద్రియాలు
4. ప్రయత్నము
5. దైవానుగ్రహము
ఐదుకారకములు.
I opine man, that has reasoning and intelligence, has limitations because opf his intelligence and reasoning are limited to his experiences and acquired knowledge (from his teachers, books and other sources). there could be some more variables that he could not known to him as this world is filled with uniqueness and nothing is static. Uniqueness causes differences when you have 2 objects. This situation is coupled with independent reasoning. This adds to the complexity of the situation. This complex situation continues to be there ever since man is born with his intellect and reasoning. This ever unresolved complexity is “God” almighty. Some in its extremity raised the question
“What is before big-bang?’ The theoretical physicists and practical quantum physicists differ.
Theoretical Physicists believe
Prior to the Big Bang — yes, before the Big Bang — the universe underwent a breathtaking cosmic expansion, doubling in size at least 80 times in a fraction of a second. This rapid inflation, fueled by a mysterious form of energy that permeated empty space itself, left the universe desolate and cold.
The Quantum Physicists (Stephen Hawkings)
The “no-boundary proposal, which Hawking and his frequent collaborator, James Hartle, fully formulated in a 1983 paper, envisions the cosmos having the shape of a shuttlecock. Just as a shuttlecock has a diameter of zero at its bottommost point and gradually widens on the way up, the universe, according to the no-boundary proposal, smoothly expanded from a point of zero size. Hartle and Hawking derived a formula describing the whole shuttlecock — the so-called “wave function of the universe” that encompasses the entire past, present and future at once — making moot all contemplation of seeds of creation, a creator, or any transition from a time before.
సర్వభూతేషుయేనైకంభావమవ్యయమీక్షతేఅవిభక్తంవిభక్తేషుతజ్జ్ఞానంవిద్ధిసాత్త్వికమ్৷৷18.20৷৷
ఙ్ఞానం ఎప్పుడైతే మనిషి, అన్ని జివరాసుల్లొని ప్రణాంస ప్రాణంలోనిదని, అది అవిభాజ్యమని తెలిసినప్పుడు, సాత్వికమని పిలవబడుతుంది.
పృథక్త్వేనతుయజ్జ్ఞానంనానాభావాన్పృథగ్విధాన్వేత్తిసర్వేషుభూతేషుతజ్జ్ఞానంవిద్ధిరాజసమ్৷৷18.21৷৷
అన్ని ప్రాణులు తమ రూపాలబట్టి, ఙ్ఞానాఙ్ఞానల్ని బట్టి విడివిడిగా చూడటం రాజసమౌతుంది.
యత్తుకృత్స్నవదేకస్మిన్కార్యేసక్తమహైతుకమ్అతత్త్వార్థవదల్పంచతత్తామసముదాహృతమ్৷৷18.22৷৷
తామసిక జ్ఞానము సంపూర్ణ సృష్టి అంతా భిన్నభిన్న భాగములే అని, హేతు బద్ధంకాని వాదము.
నియతంసంగరహితం అరాగద్వేషతఃకృతమ్అఫలప్రేప్సునాకర్మయత్తత్సాత్త్వికముచ్యతే৷৷18.23৷৷
ధర్మ బద్ధంగాను, అనుబంధం లేనిదిగాను, ఫలాపేక్షలేనిదిగాను, రాగద్వేష రహితముగా ఉన్నదో ఆ కర్మ సత్త్వగుణములో ఉన్నట్టు అని చెప్పబడినది.
యత్తుకామేప్సునాకర్మసాహఙ్కారేణవాపునఃక్రియతేబహులాయాసంతద్రాజసముదాహృతమ్৷৷18.24৷৷
స్వార్ధ కోరికతోను, అహంకారముతోను, ఎక్కువ శ్రమతోను (బహుళాయాసం) చేయబడ్డ కర్మ రజోగుణములో ఉన్నదని చెప్పబడింది.
అనుబన్ధంక్షయంహింసాంఅనపేక్ష్యచపౌరుషమ్మోహాదారభ్యతేకర్మయత్తత్తామసముచ్యతే৷৷18.25৷৷
మొహము తో అరంభించి, పరిణామాలను పట్టించుకోకుండా, నష్టమూq, హింసానూ, తన శక్తినీ తెలుసుకోకుండా చేసే కర్మ తామసమౌతుంది.
ముక్తసఙ్గోనహంవాదీధృత్యుత్సాహసమన్వితఃసిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తాసాత్త్వికఉచ్యతే৷৷18.26৷৷
ఎప్పుడైతే కర్మ సంబంధాలతో విముక్తి పొందుతాడో, తన గూర్చి ఎక్కువచేసుకోడో, ఉత్సాహమును, దృఢ సంకల్పంతోను జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉంటాడో అప్పుడు కర్త సత్వ గుణుడని అంటారు.
రాగీకర్మఫలప్రేప్సుఃలుభ్ధోహింసాత్మకోశుచిఃహర్షశోకాన్వితఃకర్తారాజసఃపరికీర్తితః৷৷18.27৷৷
కర్త, ఎవరు తన పనుల మీద మక్కువ పెంచు కుంతారో, ఫలాపేక్ష కలిగి ఉంటారో, ఎవరు అత్యాశా పరులై ఉంటారో, ఇతరులకు హాని కర మౌతారో, అ పవిత్రత తో ఉండి, హర్ష శోకములచే ప్రభావితమ వుతూ ఉంటారో, అప్పుడు రాజసి ఔతాడు.
అయుక్తఃప్రాకృతఃస్తబ్ధఃశఠోనైష్కృతికోలసఃవిషాదీదీర్ఘసూత్రీచకర్తాతామసఉచ్యతే৷৷18.28৷৷
అర్హత లేని, అపరిశుభ్ర మైన, మొండి ట్టుదల గలిగి, చెడి పోయిన, నిజాయితీ లేని, ఉదాసీన మైన, నిరుత్సాహపరు డైన, జాగు చేసే లక్షణాలు ఉంటే కర్త తామసి అవుతాడు.
ప్రవృత్తించనివృత్తించకార్యాకార్యేభయాభయేబన్ధంమోక్షంచయావేత్తిబుద్ధిఃసాపార్థసాత్త్వికీ৷৷18.30৷৷
ఓ అర్జునా, ఏది కర్మ, ఏది త్యాగము, ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు, దేనికి భయపడవలెను, దేనికి భయపడ వలసిన అవసరంలేదు, ఏది బంధనము, ఏది బంధన విముక్తి అనేది సాత్విక బుద్ధి మాత్రమే తెలిసికొన గలదు.
యయాధర్మమధర్మంచకార్యంచాకార్యమేవచఅయథావత్ప్రజానాతిబుద్ధిఃసాపార్థరాజసీ৷৷18.31৷৷
ఏ బుద్ధి వలన ధర్మాధర్మ సంసయము కలిగిస్తుందో, కర్మ నిర్వహణలో ధర్మాధర్మ విచక్షణ తెలియనియ్యదో, ఆ బుద్ధి "రాజస" బుద్ధి, అర్జునా, ప్రిథ యొక్క పుత్రుడా.
ధృత్యాయయాధారయతే మనఃప్రాణేన్ద్రియక్రియాఃయోగేనావ్యభిచారిణ్యాధృతిఃసాపార్థసాత్త్వికీ৷৷18.33৷৷
యోగము ద్వారా, ఙ్ఞానేంద్రియాలను ధృఢ సంకల్పంతో (అవ్యభిచారిణ్యా) నియంత్రిస్తారో, ఆ నియంత్రణ సత్త్వ ఙ్ఞానమౌతుంది.
యయాతుధర్మకామార్థాన్ ధృత్యాధారయతేర్జునప్రసఙ్గేనఫలాకాఙ్క్షీ ధృతిఃసాపార్థరాజసీ৷৷18.34৷৷
ప్రతి ఫలాపేక్ష తో మొదలుపెట్టిన ధర్మ + కామ + అర్థా కర్మలు (విధులతో, కోరికలతో, సంపదలతో ముడి పడినవి) స్థిర చిత్తము రాజసిక ధృతి (నిశ్చయము) అని చెప్ప బడును.
యయాస్వప్నంభయంశోకంవిషాదంమదమేవచనవిముఞ్చతిదుర్మేధాధృతిఃసాపార్థతామసీ৷৷18.35৷৷
ధృడ సంకల్పంతో పగటి కలలు కంటూ, భయము, శోకము, నిరాశ, అభిరుచి (పాషన్), ఓ ఆర్జున, గుణాలతో "తామసులు" ఉంటారు.
యత్తదగ్రేవిషమివపరిణామేమృతోపమమ్తత్సుఖంసాత్త్వికంప్రోక్తం ఆత్మబుద్ధిప్రసాదజమ్৷৷18.37৷৷
విషము లా ప్రారంభమై చివరకు అమృతం అటువంటి సుఖము ఇవ్వగలిగినది సత్వగుణము.
విషయేంద్రియసంయోగాత్యత్తదగ్రేమృతోపమమ్పరిణామేవిషమివతత్సుఖంరాజసంస్మృతమ్।। 38 ।।
ఇంద్రియ సంపర్కముతో కలిగే సుఖమును రజసముగా గుర్తిస్తారు.అమృతము వలె మొదలై విషము లాగా పరిణమిచేది రాజసము.
యదగ్రేచానుబన్ధేచసుఖంమోహనమాత్మనఃనిద్రాలస్యప్రమాదోత్థంతత్తామసముదాహృతమ్৷৷18.39৷৷
ఆత్మ యొక్క అస్థిత్వమును పూర్తిగా మొదలు నుండి చివర వరకు కప్పివేసి, నిద్ర, సోమరితనము, నిర్లక్ష్యము లనుండి ఉద్భవించిన ఆనందము తామసిక (తమోగుణములో) ఆనందము అని చెప్పబడును.
బ్రాహ్మణక్షత్రియవిశాంశూద్రాణాంచపరంతపకర్మాణిప్రవిభక్తానిస్వభావప్రభవైర్గుణైః৷৷18.41৷৷
బ్రాహ్మణులు (బ్రహ్మ ఙ్ఞానము కలవారు), క్షత్రియులు (క్షాత్రమున్నవారు), వైశ్యులు(విశాం),శూద్రులు వారి వారి లక్షణానుసారంగా వారి యొక్క విధులు వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి (స్వభావప్రభవైర్గుణైః). పుట్టుక పరంగా కాదు అని అవ్యక్తభావం/అవ్యక్తభాష లో చెప్పబడింది.
శమోదమస్తపఃశౌచంక్షాన్తిరార్జవమేవచజ్ఞానంవిజ్ఞానమాస్తిక్యంబ్రహ్మకర్మస్వభావజమ్৷৷18.42৷|
సమము (శంతము), దమము (ఇంద్రియ నిగ్రహణ), తపస్సు, స్వచ్చత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము, అస్తికత్వం (అస్తికత్వం = కలదును విశ్వాసము కలవాడు) అనేవి బ్రాహ్మణుల లక్షణాలు.
వివరణ:
ఈ విఒస్వాన్ని నడిపించే వేరు శక్తి కలదనే విశ్వాసము, సమము (శంతము), దమము (ఇంద్రియ నిగ్రహణ), తపస్సు, స్వచ్చత, సహనం,చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము అనేవి బ్రాహ్మణుల లక్షణాలు. అంతే గాని పుట్టుక ఎవరినీ బ్రాహ్మణులను కాలేరు.
శౌర్యంతేజోధృతిర్దాక్ష్యంయుద్ధేచాప్యపలాయనమ్దానమీశ్వరభావశ్చక్షాత్రంకర్మస్వభావజమ్৷৷18.43৷৷
శౌర్యం, తేజం, ధైర్యం, యుద్ధమందు నేర్పు (యుద్ధేదాక్షం), చ (మరియు) + అపి (కూడా) + అపలయనం (పారిపోనితనం) (చాప్య పలాయనమ్) = మరియు పారి పోలేని తనం కలవారు క్షాత్రం ఉన్నవారు అనగా క్షత్రియులు. (పుట్టుకతో ఎవరూ క్షత్రియులు కారు).
కృషిగౌరక్ష్యవాణిజ్యంవైశ్యకర్మస్వభావజమ్పరిచర్యాత్మకంకర్మశూద్రస్యాపిస్వభావజమ్৷৷18.44৷৷
కృషి (వ్యవసాయము), గౌరక్ష్య (గోరక్షణ), వాణిజ్యం (వ్యాపారం చేయువారు) అనేవి వైశ్య గుణములు ఉన్న వారికి సహజ సిద్ధ మైన పనులు. (జన్మతో వైశ్యు లెవ్వరూ లేరు).
సామాజిక సేవలు (అనగా సంఘానికి సేవలు చేయు వారు. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అందించే సేవలు గాక మిగిలిన సేవలు) అందించే వారు శూద్రులు. పుట్టుకతో శూద్రు లెవ్వరూ లేరు.
వివరణ:
వృత్తులు (శరీరతత్వం) చెపుతాయి గాని పుట్టుకలు చెప్పవు.
…………………………………………………….
స్వకర్మనిరతఃసిద్ధింయథావిన్దతితచ్ఛృణు৷৷18.45৷৷
తన ధర్మములను నిర్వహించి మనిషి పరిపక్వత సాధించుతాడు.
అసక్తబుద్ధిఃసర్వత్ర జితాత్మావిగతస్పృహఃనైష్కర్మ్యసిద్ధింపరమాంసంన్యాసేనాధిగచ్ఛతి৷৷18.49৷৷
ఎవరి బుద్ధి అయితే ఆసక్తి రహితంగా ఉంటుందో అంతటా మనస్సుని అధీనము లోనికి తీసుకుని నిష్కామకర్మలను చేస్తారో వారు అత్యున్నతమైన సన్యాసము అభ్యాసముచే పొందుతారు.
బుద్ధ్యావిశుద్దయాయుక్తఃధృత్యాత్మానంనియమ్యచశబ్దాదీన్విషయాన్త్యక్త్వారాగద్వేషౌవ్యుదస్యచ।। 18.51 ।।৷
బుద్ధి శుద్ధి చేయ బడి కలిగి ఉండి ధృఢ సంకల్పముచే బుద్ధి నిగ్రహించి మరియు శబ్దము మొదలైన ఇంద్రియ విషయములు త్యజించిరాగ-ద్వేషములు విడిచిపెట్టి
వివిక్తసేవీలఘ్వాశీ యతవాక్కాయమానసఃధ్యానయోగపరోనిత్యం వైరాగ్యంసముపాశ్రితః৷৷18.52৷৷
ఒంటరితనాన్ని ఆశ్ర యిచి, శరీరావసరాలకు తింటు, మిత భాషి యై, శరీరమూ మనస్సూ యోగా ధ్యానంలో ఉన్న వారూ ముక్తి పొందుతారు.
అహఙ్కారంబలందర్పంకామంక్రోధంపరిగ్రహమ్విముచ్యనిర్మమఃశాన్తో బ్రహ్మభూయాయకల్పతే৷৷18.53৷৷
అహంకారము హింస దురహంకారము కామము (కోరికలు) కోపము స్వార్ధము విడిచి ఇది నాది అన్న భావన లేకుండా శాంతితో; బ్రహ్మతో మ మేకము అర్హుడు అగును.
బ్రహ్మభూతఃప్రసన్నాత్మానశోచతినకాఙ్క్షతిసమఃసర్వేషుభూతేషుమద్భక్తింలభతేపరామ్৷৷18.54৷৷
బ్రహ్మభూతః = పరమ ప్రాణ శక్తి (ఇది నా అభిప్రయము), పరబ్రహ్మాం (సనాతన అర్థము)
ప్రసన్నాత్మా = ప్రశాంతతతో చిత్తముతో (ఉంటాడు)
న సోచతి = ఏడ్వడు
న కాంక్షతి = కాంక్షింపడు
సమః సర్వేషు భూతేషు = సమ భావముతో అన్ని ప్రాణులను
పరామ్ = సర్వోత్కృష్టమైన స్థితి
లభతే = పొందును.
పరమ ప్రాణ శక్తి లేక పరబ్రహ్మాం ప్రశాంతతతో చిత్తముతో ఏడ్వడు, కాంక్షింపడు. సమ భావముతో అన్ని ప్రాణులను చూస్తూ (మద్భక్తిం = నాయందు పరాభక్తిని) సర్వోత్కృష్టమైన స్థితిని పొందును.
యదహఙ్కారమాశ్రిత్యనయోత్స్యఇతిమన్యసేమిథ్యైషవ్యవసాయస్తేప్రకృతిస్త్వాంనియోక్ష్యతి৷৷18.59৷৷
నీ స్వీయ అహంకారం తో, అలోచించి నిర్ణయించుకొంటే, “యుద్ధంచేయనని”, ఆ నిర్ణయము ఫలించదు. నీ స్వభావము (క్షత్రియ స్వభావము) నీచేత బలవంతంగా యుద్ధంచేయిస్తుంది.
యత్రయోగేశ్వరఃకృష్ణోయత్రపార్థోధనుర్ధరఃతత్రశ్రీర్విజయోభూతిఃధ్రువానీతిర్మతిర్మమ৷৷18.78৷৷
అర్థము:
ఎక్కడ కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అర్జునుడు ఉంటాడో అక్కడ ఎల్ల శుభములు, విజయము, సకల-సమృద్ధి మరియు ధర్మమూ ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము.
వివరణ:
ఎక్కడ సరియిన అలోచన (కృష్ణ) ఎక్కడ అలోచనలను నిర్ణయాలు గా మార్చి అమలు చేస్తారో అక్కడ ఎల్ల శుభములు, విజయము, సకల-సమృద్ధి మరియు ధర్మమూ ఉంటాయి.
ఇది నాలో వచ్చిన ఓ అలోచన:
----------------------------
క్లైబ్యం మా స్మ గమః పార్థ
నైతత్త్వయ్యుప పద్యతే
క్షుద్రం హృదయదౌర్బల్యం
త్యక్త్వోత్తిష్ఠ పరన్తప (BG -2 అధ్యాయం.3 శ్లోకం)
ఎవరు "హృదయం" (భావో ద్వేగాలకు లోనుకాకుండా) తన విషయంలో నిర్ణయాలు తీసుకోడు. అలా తన వృత్తిలో నిర్ణయాలు తీసు కొనవచ్చు.
ఇక కర్మ నిర్వహణ కొస్తే, తన వ్యక్తిగత విషయాల్లో నిర్ణయాలలో భావోద్వేగాలు తప్పక తమ పాత్ర పోషిస్తాయి. కారణం మనం మన తర్కమును ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటాము. ఆ తర్కంలో భావోద్వేగాలు తప్పక మనం ఙ్ఞాపకాలు, అనుభవాలు, తను తిరిగే బృందమునుంచి, మనం చదివే పుస్తకాల నుంచి తెచ్చుకున్న ఙ్ఞానం మన నిర్ణయాలలో తమ పాత్రపొషిస్తాయి. మన మనసుకు నచ్చివేవో మనం ఙ్ఞాపకము ఉంచుకుంటాము.
అదే, జంతువుల కొస్తే, వాటి తర్కం ప్రాధమిక స్థితి (దస) లో ఉంటుంది. కాలానుగుణంగా హార్మోన్ ప్రభావంతో, ఆత్మ రక్షణతో, లేక ఆకలి దప్పులతోనో తమ కర్మలను చేస్తాయి. ఆ కర్మలని ఫలాపేక్షిత కర్మలని ఎమీ చెప్పలేము.
వాటికి అవసరం లేని జీవిత యుద్ధ సన్నద్ధతా శాస్త్రం "భగవద్గీతా" అవసరం లేకుండా, వెనుతిరగని, మడమ తిప్పని యుద్ధం చేస్తాయి, మనిషి తప్ప అన్ని జీవాలు.
ఎదురుగాఉన్న జీవాలని చూసి (నాగరికతా ముసుగుని) తొలగించుకుంటే అది సాధ్యమేమో, తెలియదు! మీరూ అలోచించండి.